మోర్తాడ్/ నందిపేట, నవంబర్ 18: ఆదిలాబాద్ జిల్లాలో పత్తిరైతులను కలిసి వారి కష్టాలను తెలుసుకునేందుకు సిరిసిల్ల నుంచి బయలుదేరిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు జిల్లా సరిహద్దు మండలమైన కమ్మర్పల్లి వద్ద మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. కేటీఆర్‌కు స్వాగతం పలికేందుకు ఎనిమిది గంటల నుంచే పార్టీ శ్రేణులు కమ్మర్‌పల్లిలోని భీమ్‌గల్ చౌరస్తా వద్దకు చేరుకున్నాయి.
కమ్మర్‌పల్లికి చేరుకున్న కేటీఆర్‌కు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి పచ్చ కండువా కప్పి, ఆత్మీయ ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు. కేటీఆర్‌కు స్వాగతం పలికేందుకు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 44వ నంబర్ జాతీయ రహదారి వద్ద ఆర్మూర్ బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా ఆయన వారితో కాసేపు మాట్లాడారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు. కేటీఆర్‌కు స్వాగతం పలికిన వారిలో బాజిరెడ్డి జగన్, ఆశన్నగారి రాజేశ్వర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

