నస్రుల్లాబాద్, జూలై 12: బీఆర్ఎస్పై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మండల కేంద్రంలోని బాన్సువాడ-బోధన్ ప్రధాన జాతీయ రహదారిపై ఆ పార్టీ నాయకులు ఆదివారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బాన్సువాడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జుబేర్ మాట్లాడుతూ.. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.
కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. మండల పార్టీ నాయకులు నర్సింహులు గౌడ్, సాయిలు, మొగులయ్య,శ్రీనివా స్, రాజు, భాస్కర్, అక్తర్, భూమయ్య, వెంకట్, శేఖర్, సాయి లు, శ్రీనివాస్ గౌడ్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.