బోధన్/శక్కర్‌నగర్, అక్టోబర్ 18: సీఎం కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను చూసి బీజేపీ, కాంగ్రెస్‌కు మైండ్ బ్లాంక్ అయ్యిందని ఎమ్మెల్సీ కవిత అన్నా రు. నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పటిష్టతను చూ సి ప్రతిపక్షాలు భయపడుతున్నారని, అందుకే మొన్న ప్రధాని మోదీ, ఇప్పుడు రాహుల్‌గాంధీ వస్తున్నారని అన్నారు. అందరికీ స్వాగతం చెబుతున్నామని, టూరిస్టులుగా వచ్చి తిరిగివెళ్లండి.. తప్ప ఇక్కడి సహృద్భావ వాతావరణాన్ని మాత్రం చెడగొట్టకండి అని హితవు పలికారు. పట్టణంలోని షఫీ చమన్ వద్ద బుధవారం విలేకరులు, బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే షకీల్‌తో కలిసి కవిత మాట్లాడారు. ‘రాహుల్ గాంధీ కాదు.. ఆయన ఎలక్షన్ గాంధీ.. ఎన్నికలప్పుడు వచ్చి ఏదో నాలుగు ముచ్చట్లు చెప్పి.. దాంతో నాలుగు ఓట్లు వస్తాయని అనాలోచితమైన చర్య..’ అంటూ కాంగ్రెస్ అగ్రనేత తీరును ఎద్దేవా చేశారు.
బోధన్ నియోజకవర్గంలో పెద్ద నాయకుడిగా చెప్పుకునే సుదర్శన్‌రెడ్డి నీటిపారుదలశాఖ మంత్రిగా పనిచేసినప్పటికీ రైతులు సాగునీటి కోసం ఎన్నో కష్టాలు పడ్డారని గుర్తుచేశారు. 2014 తర్వాత చెరువులు, కుంటలు, డిస్ట్రిబ్యూటరీ కాలువలను బాగు చేసుకొని రైతులకు నీళ్లు అందిస్తున్నామన్నా రు. బోధన్ ఎమ్మెల్యే షకీల్‌తోపాటు జిల్లాలోని ఎమ్మెల్యేలు కాలువల వెంట తిరుగుతూ రైతులకు సాగునీరు అందించేందుకు కృషిచేశారన్నారు. జిల్లాలో సాగు విస్తీర్ణం రెట్టింపు అయ్యిందన్నారు. ఒక్క బోధన్‌లోనే 53వేల మందికి రైతుబంధు వస్తున్నదని తెలిపా రు. కాళేశ్వరం ప్రాజెక్టును మూడున్నరేండ్లలో పూర్తిచేసి న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు.
బోధన్ పట్టణంలోని 31వ వార్డుకు చెందిన పలువురు యువకులు స్థానిక ఎమ్మెల్యే షకీల్ ఆధ్వర్యంలో బుధవారం బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్సీ కవిత గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బోధన్ పట్టణానికి చెందిన ముస్తాఖ్, ఎడపల్లి మండ లం జైతాపూర్ గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు గురజాల రాంరెడ్డితోపాటు కాంగ్రెస్ నుంచి యు వకులు బీఆర్ఎస్లోచేరారు. మూడురోజులక్రితం పట్ణణానికి చెందిన షేక్ జావేద్ మున్సిపల్ చైర్‌పర్సన్‌తో కలిసి కాంగ్రెస్‌లోకి వెళ్లగా, తిరిగి ఆయన బీఆర్ఎస్లోకి వచ్చారు. కార్యక్రమంలో ఆయేషా ఫాతిమా, మున్సిపల్ వైస్ చైర్మన్ సోహైల్, జడ్పీ వైస్ చైర్పర్సన్ రజితా యాదవ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రవీందర్ యా దవ్, నాయకుడు బుద్దె రాజేశ్వర్పాల్గొన్నారు.