సిరికొండ, ఆగస్టు 12 : పోలీసుల అక్రమ కేసులకు బయటపడేది లేదు అని నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నారవోయిన శ్రీనివాస్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ శాంతియుతంగా నిరసన తెలిపితే తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు.
ఆందోళనలు చేపట్టడం ప్రజాస్వామ్య హక్కు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్యలో భాగంగానే బీఆర్ఎస్ నేతలపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.