Koel River | కరం వేడుకల్లో విషాదం.. నదిలో మునిగి ఐదుగురు దుర్మరణం..!
Koel River | గిరిజన పండుగ (Tribal festival) అయిన 'కరం (Karam)' వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. వేడుకల్లో భాగంగా పూజించిన చెట్టు కొమ్మను ఈ తెల్లవారుజామున నిమజ్జనాని (Immersion) కి తీసుకెళ్లిన సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. నిమజ్జనం చేసే క్రమంలో నదిలోకి దిగిన ఐదుగురు వ్యక్తులు ప్రవాహంలో కొట్టుకుపోయారు.
Koel River : గిరిజన పండుగ (Tribal festival) అయిన ‘కరం (Karam)’ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. వేడుకల్లో భాగంగా పూజించిన చెట్టు కొమ్మను ఈ తెల్లవారుజామున నిమజ్జనాని (Immersion) కి తీసుకెళ్లిన సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. నిమజ్జనం చేసే క్రమంలో నదిలోకి దిగిన ఐదుగురు వ్యక్తులు ప్రవాహంలో కొట్టుకుపోయారు. వివరాల్లోకి వెళ్తే.. పాలము జిల్లా (Palamu district) లోని మారుమూల బొకాయ గ్రామం (Bokaya village) లో మంగళవారం ఆదివాసీలు సంప్రదాయ ‘కరం’ వేడుకలు నిర్వహించారు.
బుధవారం తెల్లవారుజామున జిల్లాలోని కోయల్ నదిలో చెట్టుకొమ్మను (వేడుకల్లో భాగంగా పూజలందుకున్న దైవం) నిమజ్జనం చేయడానికి వెళ్లారు. కొమ్మను నీటిలో వదిలేందుకు ఐదుగురు నదిలోకి దిగారు. నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో పట్టుతప్పి కొట్టుకుపోయారు. వారిని రక్షించడానికి అక్కడ ఉన్న వారు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ లాభం లేకపోయింది. ఆ తర్వాత జాలర్లు మృతదేహాలను వెలికితీశారు. మృతుల్లో ముగ్గురు మైనర్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
గిరిజనులు సర్హుల్ పండుగ తర్వాత అతిపెద్ద పండుగగా ‘కరం’ పండుగను జరుపుకుంటారు. జార్ఖండ్లో మంగళవారం ఈ పండుగ జరుపుకున్నారు. ఈ పండుగలో ‘కరం’ చెట్టు కొమ్మను పూజిస్తారు. ఆ చెట్టు కొమ్మను నదిలో నిమజ్జనం చేయడంతో ఈ ఉత్సవం ముగుస్తుంది. ఈ క్రమంలోనే నిమజ్జనం కోసం నీళ్లలో దిగి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను నదిలో నుంచి తీసి పోస్టుమార్టానికి పంపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

