The Paradise | నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ మాస్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ (The Paradise). ‘దసరా’ వంటి బ్లాక్బస్టర్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, తాజాగా ఈ సినిమాకు సంబంధించి వినిపిస్తున్న ఇన్సైడ్ రిపోర్ట్స్ టాలీవుడ్ వర్గాల్లో విపరీతమైన హైప్ క్రియేట్ చేస్తున్నాయి. 1980ల నాటి సికింద్రాబాద్ నేపథ్యంతో సాగే ఈ కథలో, నాటి సామాజిక పరిస్థితులు, వివక్షకు వ్యతిరేకంగా జరిగే పోరాటాలతో పాటు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని తలపించే శక్తివంతమైన సన్నివేశాలు సినిమాకే హైలైట్గా నిలవనున్నట్లు తెలుస్తోంది.
ఇవే కాకుండా తెలంగాణ ఉద్యమ కాలం నాటి జ్ఞాపకాలు, తెలంగాణ తొలి సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోరాట శైలిని గుర్తుచేసే కొన్ని కీలక సన్నివేశాలు మరియు డైలాగులు సినిమాలో థియేటర్లను షేక్ చేయడం ఖాయమని ఇన్ సైడ్ టాక్ గట్టిగా వినిపిస్తోంది. రఫ్ అండ్ రస్టిక్ యాక్షన్ తో పాటు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్లాన్ చేసిన పొలిటికల్, రెవొల్యూషనరీ సీన్స్ ప్రేక్షకులకు గూస్బంప్స్ తెప్పించడం పక్కా అని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సినిమాలో వచ్చే తెలంగాణ ఎమోషనల్ అండ్ రెవొల్యూషనరీ సీన్స్ చూశాక థియేటర్లలో ఫ్యాన్స్ అరుపులతో స్క్రీన్స్ దద్దరిల్లడం ఖాయమని తెలుస్తుంది. అయితే ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాలి. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కాబోతున్న ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి!