నిడమనూరు, సెప్టెంబర్ 23 : నిడమనూరు వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధ్యయన యాత్రకు తరలివెళ్లింది. అధ్యయన యాత్రలో భాగంగా ఏలూరు జిల్లా కేంద్రంలోని ఆసియాలోనే ప్రసిద్ధి చెందిన నిమ్మ మార్కెట్ ను బుధవారం ఉదయం సందర్శించారు. మార్కెట్ కు నిమ్మ రాక, అమ్మకాలు, కొనుగోళ్లు, మార్కెట్ ఆదాయం తదితర అంశాలను పరిశీలించి వివరాలను ఏలూరు మార్కెట్ కమిటీ చైర్మన్ మామిళ్లపల్లి పార్ధసారధిని అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు ఎన్టీఆర్ కృష్ణాజిల్లా లోని గొల్లపూడి మార్కెట్ ను సందర్శించి కమర్షియల్ కాంప్లెక్స్ ద్వారా మార్కెట్ కు సమకూరుతున్న ఆదాయం తీరును పరిశీలించారు.
ఏలూరు మార్కెట్ పాలకవర్గ సమావేశంలో నిడమనూరు మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం ప్రత్యేక ఆహ్వానితుడిగా పాల్గొని మార్కెట్ కమిటీల బలోపేతం, ఆదాయ వనరుల పై కూలంకశంగా వివరించారు. ఏలూరు మార్కెట్ చైర్మన్ పార్ధసారధి నిడమనూరు మార్కెట్ చైర్మన్ ను శాలువాతో సత్కరించారు. అధ్యయన యాత్రలో మార్కెట్ కార్యదర్శి తోట చందర్రావు, వైస్ చైర్మన్ బుసిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, డైరెక్టర్లు మన్నేం శంకర్, పాల్వాయి చంద్రశేఖర్ రెడ్డి, మెండె వెంకటేశ్వర్లు, సపావత్ శ్రీను, పోలగాని పరశురాం, బెలిదె అశోక్, జయరాం నాయక్, మార్కెట్ సిబ్బంది రాజు, రామకృష్ణ తదితరులున్నారు.

నిడమనూరు మార్కెట్ పాలకవర్గం ఏలూరు నిమ్మ మార్కెట్ సందర్శన