– నాగినేనిప్రోలు రెడ్డిపాలెం సర్పంచ్ బానోత్ సరోజ
బూర్గంపహాడ్, సెప్టెంబర్ 23 : మొక్కలే మానవ మనుగడకు జీవనాధారమని బూర్గంపహాడ్ మండలం నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామ సర్పంచ్ బానోత్ సరోజ అన్నారు. బుధవారం గ్రామంలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛతా హరితదినం సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉప సర్పంచ్ అప్పిరెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి మొక్కలు నాటారు. అనంతరం వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బందితో కలిసి ప్లాస్టిక్ రహిత గ్రామం కోసం ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. మనం నాటే మొక్క నేడు వృక్షంగా మారి స్వచ్ఛమైన ఆక్సిజన్‌తో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తుందన్నారు. అలాగే ప్రతిఒక్కరూ ప్లాస్టిక్‌ను నిషేధించాలని, ప్లాస్టిక్ కారణంగా పచ్చదనానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుందని ప్రతిఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములై ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రవి, ఉపసర్పంచ్ అప్పిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, వార్డుమెంబర్ అవినీటి నర్సయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ శంకర్, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.