‘ది ఫర్గాటెన్ మావెరిక్’ మన బాధ్యత గుర్తు చేసే పుస్తకం
ఆత్మకథల్లోని నిజమైన సంఘటనలను కల్పిత పాత్రలతో రచించే సృజనాత్మక సాహిత్య రూపం ‘ద ఫర్గాటెన్ మావరిక్' నవల. రచయిత మను నెల్లుట్ల. పెండ్యాల రాఘవరావు స్వీయ చరిత్ర రచన నుంచి విషయం గ్రహించి ఇంగ్లిష్‌లో రాశారు. ఆనాటి నిజాం ప్రభుత్వాన్ని ఎదిరించి, పలుమార్లు జైలు పాలై, తన యవ్వన కాలమంతా ప్రజలకే అంకితం చేసిన సాయుధ పోరాట వీరుడు ఆయన. ఆ వివరాలు పుస్తక రచయిత మాటల్లోనే..
ఆత్మకథల్లోని నిజమైన సంఘటనలను కల్పిత పాత్రలతో రచించే సృజనాత్మక సాహిత్య రూపం ‘ద ఫర్గాటెన్ మావరిక్’ నవల. రచయిత మను నెల్లుట్ల. పెండ్యాల రాఘవరావు స్వీయ చరిత్ర రచన నుంచి విషయం గ్రహించి ఇంగ్లిష్‌లో రాశారు. ఆనాటి నిజాం ప్రభుత్వాన్ని ఎదిరించి, పలుమార్లు జైలు పాలై, తన యవ్వన కాలమంతా ప్రజలకే అంకితం చేసిన సాయుధ పోరాట వీరుడు ఆయన.
ఆ వివరాలు పుస్తక రచయిత మాటల్లోనే..
1952 మొదటి సార్వత్రిక ఎన్నికల్లో ఒకేసారి మూడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన పెండ్యాల మంచి మెజారిటీతో గెలుపొందిన తర్వాత రెండు స్థానాలకు రాజీనామా చేశారు. ఆ తర్వాత వరంగల్ ఎంపీగా గెలిచి, ఐదేండ్లపాటు ప్రజాసేవ చేస్తూ, ప్రజాగళాన్ని వినిపించారు. ఆయన అనుభవాలను ‘నా ప్రజాజీవితం’ పేరుతో ‘జనధర్మ’ పత్రికలో (1980లో) రాశారు. పెండ్యాల రాఘవరావు ఆనాటి వెట్టిచాకిరి, అస్పృశ్యత వంటి సాంఘిక దురాచారాలను ఖండించాలని, భూస్వాములను, ప్రభుత్వాన్ని ఎదిరించిన నేపథ్యాన్ని, ప్రత్యక్ష విషయాలను ఒక యువ మేధావిగా కొంతవరకు మాత్రమే రాశారు. మహోజ్వల పోరాటాలు, ఆయన అనుభవించిన అన్ని జైలు జీవితాలు వంటివి అందులో రాలేదు. అలా అసంపూర్ణంగా ఆగిపోయిన ఈ విషయాన్నీ 2005, 2006లో అప్పటికి బతికున్న స్వాతంత్య్ర సమరయోధులను ఇంటర్వ్యూ చేసి గ్రహించిన విషయాలంతా కలిపి ‘నా ప్రజా జీవితం’ పేరుతో ఆయన కుటుంబ సభ్యులు ప్రచురించిన విషయమే ఈ నవలా వస్తువు.
‘నేను ఈ పుస్తకాన్ని కేవలం జీవిత చరిత్రగా రాయలేదు. దానికి ఒక కారణం ఉన్నది. మా తాతయ్య పెండ్యాల రాఘవరావు స్వయంగా రాసిన ‘నా ప్రజా జీవితం’ వ్యాసాలు 1970లో జనధర్మ పత్రికలో వచ్చాయి. అవి ఆయన చివరి ఏండ్లలో జ్ఞాపకాలతో రాసినవి. ఆ వ్యాసాలను, వాటి చుట్టూ వచ్చిన నివాళులు, జ్ఞాపకాలను మా పిన్ని డాక్టర్ కొండపల్లి నీహారిణి చేర్చి వెలువరించిన ‘నా ప్రజా జీవితం’ పుస్తకాన్నే ఆధారంగా తీసుకున్నాను. ఆయన ఒక వ్యాసంలో ఓ వాక్యాన్ని మధ్యలోనే ఆపేశారు. అందుకే ఆ ఆధారంపై కల్పనను జోడించి, ఈ కథను మరింత ఆసక్తికరంగా, ఎక్కువమందికి చేరేలా రాశాను. అమ్మమ్మ కౌసల్యాదేవి జ్ఞాపకాలు, సహచరుల కథనాలు ఉన్నాయి.
యువ పాఠకులు నవలలు ఎక్కువగా చదువుతారు. చరిత్ర గ్రంథం పెద్దగా చదవరు. ఒక పాత్రతో అనుబంధం ఏర్పడితే, ఆ పాత్ర జీవించిన చరిత్రను వాళ్లే వెతుకుతారు. తమ ఇంట్లో పెద్దలను అడుగుతారు, తమ గ్రామం గురించి, దేశం గురించి తెలుసుకుంటారు. అందుకే చరిత్రను కథగా చెప్పాను. అందుకే ఈ పుస్తకాన్ని మొదట ఇంగ్లిష్‌లో రాశాను. హైదరాబాద్ కథ తెలుగువారికే కాదు, భారతీయులందరికీ తెలియాలి. ఇంగ్లిష్‌లోని ఈ కథను దేశం దాటి తీసుకెళ్తుంది’. ఈ నెల 24వ తేదీ ఉదయం 10 గంటలకు హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఈ పుస్తకావిష్కరణ సభ జరుగనున్నది.
పుస్తక రచయిత
మను నెల్లుట్ల
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

