Car set fire | గుర్తు తెలియని వ్యక్తులు బీఆర్ఎస్ మాజీ ఎంపీపీ కారుకు నిప్పు పెట్టిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ జరిగిన ఈ ఘటన రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
గుర్తు తెలియని దుండగులు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆలూరు మండలం మచ్చర్ల గ్రామంలో శుక్రవారం అర్థరాత్రి మాజీ ఎంపీపీ పస్కా నరసయ్య కారుకు నిప్పు పెట్టారు. వెంటనే అప్రమత్తమై మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.
మంటలు అదుపులోకి రాకపోవడంతో కారు పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న నిజామాబాద్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Actor Pragathi | నా పూజల వలనే మెడల్స్ గెలిచింది.. నటి ప్రగతి పతకాలపై వేణు స్వామి కామెంట్స్
Akhanda 2 | బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న ‘అఖండ 2’.. బాలయ్య మాస్ తుపానుకి తొలి రోజు ఫుల్ కలెక్షన్స్
Lionel Messi | ఒకచోట ఇద్దరు దిగ్గజాలు.. మెస్సీని కలిసిన షారుఖ్ ఖాన్.. వీడియో