ధర్పల్లి : సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్ డిఎంహెచ్ఓ (DMHO) డాక్టర్ రాజశ్రీ, డీసీహెచ్ఎస్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. నిజామాబాద్ (Nizamabad) జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ దవఖానాను వారు సందర్శించి ఆస్పత్రిలో జరుగుతున్న ప్రసవాలు, ప్రసవలకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పలు సూచనలు చేశారు. టీకాల గది, ఐపీ, ఓపీ,డెలివరీ రిజిస్టర్లను పరిశీలించారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,సిబ్బంది ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
నెహ్రు యువాకేంద్ర ఆధ్వర్యంలో క్లస్టర్ ఆప్ బ్లాక్ స్పోర్ట్స్ మీట్
బాన్సువాడ: మేరా యువ భారత్ కార్యక్రమంలో భాగంగా నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో క్లస్టర్ ఆఫ్ బ్లాక్ స్పోర్ట్స్ మీట్‌ను బాన్సువాడ, నస్రుల్లాబాద్, బీర్కూర్ మండలాల యువతకు ఎస్.ఆర్.ఎన్.కె డిగ్రీ కళాశాలలో నిర్వహించారు. ఈ క్రీడా పోటీల్లో వాలీబాల్ ,కబడ్డీ, బ్యాడ్మింటన్, 200 మీటర్ రన్నింగ్ పోటీలను నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులను , ప్రశంస పత్రాలను అందజేశారు. ప్రతిభ కనబర్చిన యువతకు
జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేయడం నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ వేణుగోపాలస్వామి, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ భూలక్ష్మి, ఎస్ఎస్ఎల్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రశాంత్ పాల్గొన్నారు.
ప్రభుత్వ కళాశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు యాదగౌడ్, జలీల్ అన్నారు. గురువారం వివిధ పాఠశాలల్లో అడ్మిషన్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 10వ తరగతి చదువుతున్న విద్యార్థులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన అధ్యాపకులు ఉంటారని వివరించారు. తమ ఉజ్వల భవిష్యత్తు కోసం బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల(కో-ఎడ్యుకేషన్) లో ప్రవేశం పొందాలన్నారు. కళాశాల లో ఉచిత ప్రవేశం,పుస్తకాలు, అంకితభావం తో పని చేసే లెక్చరర్లు, చదువు తో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తుందని తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు ఈ సంవత్సరం ఎంబీబీఎస్‌లో (MBBS )లో మూడు ఉచిత సీట్లు పొందారని తెలిపారు. కళాశాలకు చెందిన విద్యార్థి టీటీసీ(TTC)లో స్టేట్ టాప్ ర్యాంక్ సాధించారని వివరించారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు రుక్మిణి, ఇక్బాల్, మహేష్, అభిలాష్, దయనంద్, మక్బూల్, విద్యార్థులు పాల్గొన్నారు.
పెద్ద కొడప్ గల్: కామారెడ్డి జిల్లా పెద్దకొడప్గల్ మండలంలోని విట్టల్ వాడి, వాడి తండాలో గురువారం సీసీ రోడ్డు పనులను కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ..రూ.5లక్షల నిధులతో సీసీ రోడ్ పనులు ప్రారంభించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు శంకర్ పటేల్ ,జాగూర్ సింగ్, రాథోడ్ విజయ్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్మూర్ పట్టణంలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని, అధికారులు పట్టించుకోవడం లేదని బీజేపీ నాయకులు గంగాధర్ మున్సిపల్ కమిషనర్ రాజుకు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ సిబ్బంది కుక్కలను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వినతిపత్రం అందజేశారు. కుక్క కాటుకు (Dog Bite) గురైన బాధితులను ఆదుకోవాలని కోరారు.