హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): మున్సిపల్ ప్రాంతాల్లోని సింగిల్ స్రీన్ థియేటర్లలో పారింగ్ చార్జీలు రద్దుచేస్తూ ఇటీవల సింగిల్ జడ్జి జారీచేసిన ఉత్తర్వులు కేవలం దిల్‌సుఖ్‌నగర్‌లోని కోణార్ థియేటర్‌కే వర్తిస్తాయని హైకోర్టు స్పష్టం చేసింది. సింగిల్ స్రీన్ థియేటర్లలో పారింగ్ చార్జీల వసూలుకు అనుమతిస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవో 121పై రామావత్ ప్రేమ్‌కుమార్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఆ జీవోపై సింగిల్ జడ్జి స్టే విధించడంతోపాటు పారింగ్ ఫీజు వసూలు చేయరాదని ఆదేశించిన విషయం తెలిసిందే.
ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ సుదర్శన్ 35ఎంఎం, ఆర్ఆర్ సినీ ఎంటర్‌ప్రైజస్ తదితరులు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై బుధవారం విచారణ చేపట్టిన హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం.. సింగిల్ జడ్జి ఉత్తర్వులను కేవలం ఒక్క థియేటర్‌కే పరిమితం చేసింది.