జహీరాబాద్, జూలై 30 : తమ వార్డు అభివృద్ధి విషయంలో తీవ్ర అన్యాయం చేస్తున్నారంటూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపల్ కౌల్సిలర్ భర్త, ఎంఐఎం నాయకుడు చెప్పుతో కొట్టుకొని నిరసన తెలిపారు. రాంనగర్ వార్డు ఎంఐఎం నేత, కౌన్సిలర్ భర్త ఈర్మియా గురువారం మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ మద్ద తు కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ పదవిని సొంతం చేసుకున్నదని తెలిపారు.
తమ వార్డులో నెలకొన్న సమస్యలు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. కౌన్సిల్ ఏర్పడి ఆరు నెలలు గడిచినా వార్డులో కనీసం తాగునీరు, వీధిలైట్లు, డ్రైనేజీ వంటి సమస్యలను పరిష్కరించలేకపోయారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతిచ్చి ఘోర తప్పుచేశామంటూ మీడియా ఎదుటే చెప్పుతో కొట్టుకొని నిరసన తెలిపారు.