కండలు పెంచాలన్నా, కొవ్వును కరిగించాలన్నా తక్కువ కార్బోహైడ్రేట్లు, ఎక్కువ ప్రొటీన్లు ఉన్న ఆహారం తీసుకోవాలి. మార్కెట్లో ప్రొటీన్ పౌడర్లు, ఇతర ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా ఇంట్లోనే ప్రొటీన్ పౌడర్ని తయారు చేసుకోవచ్చు. అర కప్పు శనగపప్పు, అర కప్పు బాదాం, పావు కప్పు కాజు, పావు కప్పు గుమ్మడి గింజలు, రెండు టేబుల్ స్పూన్ల అవిసె గింజలు లేదా చియా గింజలతో ప్రొటీన్ పౌడర్ తయారు చేసుకోవచ్చు.
తక్కువ ఖర్చుతో తేలికగానే ఈ ప్రొటీన్ పౌడర్ తయారవుతుంది. ఈ గింజలు, విత్తనాలను వేర్వేరుగా పెనం మీద మూడు నుంచి నాలుగు నిమిషాలు వేయించాలి. చల్లబడ్డాక వాటిని మిక్సీలో పిండి చేయాలి. గాలి చొరబడని గాజు సీసాలో ఈ ప్రొటీన్ పిండిని నిల్వ చేసుకోవాలి. ఒకటీ రెండు వారాలపాటు వాడుకోవచ్చు. ఇలా చేస్తే డబ్బులు ఆదా అవుతాయి. రుచి కోసం కలిపే రసాయనాల నుంచి తప్పించుకోవచ్చు. కిడ్నీలను కాపాడుకోవచ్చు.