Cult | ‘కల్ట్’ రిలీజ్ ట్రైలర్.. రక్తపాతం, భయంకరమైన హత్యలతో విశ్వక్ సేన్ విశ్వరూపం!
Cult | టాలీవుడ్ నటుడు విశ్వక్ సేన్ మరోసారి దర్శకుడిగా తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘కల్ట్’ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. భారతీయ సినిమాలో తొలి స్లాషర్ చిత్రంగా ప్రచారం పొందుతున్న ఈ సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్ లభించింది. థియేటర్లలో విడుదలకు కొన్ని గంటల ముందు చిత్రబృందం రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేసింది.
Cult | టాలీవుడ్ నటుడు విశ్వక్ సేన్ మరోసారి దర్శకుడిగా తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘కల్ట్’ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. భారతీయ సినిమాలో తొలి స్లాషర్ చిత్రంగా ప్రచారం పొందుతున్న ఈ సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్ లభించింది. థియేటర్లలో విడుదలకు కొన్ని గంటల ముందు చిత్రబృందం రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేసింది. కత్తిపోట్లు, కోతలు, భయపెట్టే సన్నివేశాలతో నిండిన ఈ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటికే విడుదలైన తొలి ట్రైలర్లో సినిమా నేపథ్యాన్ని పరిచయం చేస్తూ, ఓ పార్టీలో జరిగే హింసాత్మక ఘటనల గురించి చూపించారు. తాజాగా వచ్చిన రిలీజ్ ట్రైలర్లో మాత్రం విశ్వక్ సేన్ పోషించిన డీఎస్పీ సంకల్ప్ నాయక్ పాత్రకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.
గోవాలో స్థానికులు స్థానికేతరులను, ముఖ్యంగా తెలుగు వారిని ఇబ్బందులకు గురిచేయడాన్ని సంకల్ప్ సహించడు. వారిని రక్షించాలనే ఉద్దేశంతో గోవాకు వెళ్లిన అతడి చుట్టూ కథ తిరుగుతుంది. ట్రైలర్ చివర్లో పార్టీలో అతడు సాగించే హత్యాకాండను చూపించారు. యాక్షన్‌తో పాటు స్లాషర్ తరహా సన్నివేశాలు ట్రైలర్లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. సంకల్ప్ నాయక్ పాత్రలో విశ్వక్ సేన్ దూకుడు, క్రూరత్వం స్పష్టంగా కనిపిస్తున్నాయి. పాత్రకు తగ్గట్టుగా ఆయన ఆగ్రహభరితమైన నటన ఆకట్టుకుంటోంది. హింసాత్మక సన్నివేశాలను కూడా ప్రత్యేకమైన శైలిలో, కొంత కార్టూన్ తరహా రూపంలో తెరకెక్కించడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది.
ఈ చిత్రంలో మురళీ శర్మ రాజకీయ నాయకుడిగా, శ్రీకాంత్ అయ్యంగార్ సీనియర్ పోలీసు అధికారిగా నటిస్తున్నారు. గాయత్రి భరద్వాజ్, తారక్ పొన్నప్ప తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తారక్ సినిమాస్ పతాకంపై సందీప్ కకరాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతాన్ని అందించగా, తరుణ్ భాస్కర్ సంభాషణలు రాశారు. విడుదల ట్రైలర్లో కనిపిస్తున్న రక్తపాతం, వేగవంతమైన యాక్షన్ సన్నివేశాలు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. మరి ‘కల్ట్’ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cult | ‘కల్ట్’ రిలీజ్ ట్రైలర్.. రక్తపాతం, భయంకరమైన హత్యలతో విశ్వక్ సేన్ విశ్వరూపం!
ISRO | మరో కీలక ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. శుక్రవారం రాత్రి నింగిలోకి దూసుకెళ్లనున్న జీఎస్సెల్వీ-ఎఫ్18..!
Sri Venkateswara Creations | భారీ సాహసానికి పూనుకున్న శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్.. ఒకేసారి నాలుగు క్రేజీ చిత్రాల డిస్ట్రిబ్యూషన్!
Jailer 2 | ‘జైలర్ 2’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా .. నవంబర్ 12 నుంచే స్ట్రీమింగ్ అంటూ ప్రచారం!
Pocket Rockets | నిహారిక కొణిదెల నిర్మాణంలో నూతన చిత్రం ‘పాకెట్ రాకెట్స్’.. టైటిల్ పోస్టర్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

