Danger bells | తెలంగాణలో తరుముకొస్తున్న కరువు..! చుక్క నీరు లేక నెర్రెలు వాసిన ప్రాజెక్టులు, చెయ్యిచ్చిన కాంగ్రెస్ : వీడియో
Danger bells | తెలంగాణలో ప్రమాద ఘంటికలు మోగుతున్నవి. కాంగ్రెస్ సర్కార్(Congress) అసమర్దత పాలనతో రాష్ట్రంలో కరువు(Drought) తరుముకొస్తున్నది. పంటలు ఎండిపోతున్నవి.
Danger bells | తెలంగాణలో ప్రమాద ఘంటికలు మోగుతున్నవి. కాంగ్రెస్ సర్కార్(Congress) అసమర్దత పాలనతో రాష్ట్రంలో కరువు(Drought) తరుముకొస్తున్నది. పంటలు ఎండిపోతున్నవి. బీఆర్ఎస్ హయాంలో ఎండాకాలంలో సైతం మత్తడి దుంకిన చెరువులు నేడు వర్షాకాలంలో కూడా నోరెళ్లబెడుతున్నవి. గుక్కెడు నీళ్లు, బుక్కెడు బువ్వ కోసం ప్రజలు అల్లాడిపోతున్నారు.
కరువు పాపాన్ని ఎల్‌నినోపై నెట్టేసి చేతులు దులుపుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి.. పదేళ్ల నుంచి జలకళతో విలసిల్లిన ప్రాజెక్టులు వారికి ప్రజల పట్ల ఉన్న నిర్లక్ష్యం, పాలన చేతకాని తనాన్ని కళ్లకు కడుతున్నవి. నదుల నుంచి వ`థాగా పోతున్న నీళ్లను ఎత్తిపోయాలని బీఆర్ఎస్ ఎన్నిసార్లు చెప్పిన ప్రభుత్వం పట్టించుకోలేదు. గోదావరి జలాలను ప్రాజెక్టుల్లో నింపలేదు.
ఫలితం కాంగ్రెస్ చేపిన తప్పిదాలకు ప్రజలు నేడు ఫలితాన్ని అనుభవిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసిన నీళ్లు లేక, కరెంట్ రాక సబ్బండ వర్ణాల ప్రజలు రోడ్ల మీదకొచ్చి ఖాళీ బిందెలతో నిరసనలు చేపట్టాల్సిన దుస్థితి నెలకొంది. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు వరకు నిండుకుండల్లా ఉన్న రిజార్వాయర్లు నేడు చుక్క నీరు లేక వెలవెలబోతున్నవి. మంజీరా ప్రాజెక్టులో నీళ్లు లేకపోవడంతో రైతులు పశువులను మేపుతున్నారు. సింగూరు ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ దిశగా పయనిస్తున్నది.
వర్షాకాలంలోనే ఈ పరిస్థితి ఉంటే, రానున్న రోజుల్లో హైదరాబాద్ నగర ప్రజలకు కష్టకాలం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కన్నెపల్లి వద్ద మోటర్లు ఆన్ చేసి నీటిని లిఫ్ట్ చేసి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్‌కు ఓటు వేసిన పాపానికి తడి గుడ్డతో గొంతే కోసుకున్నట్లయిందని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్టుల నుంచి నీటిని ఎత్తిపోయాలని కోరుతున్నారు.
చుక్క నీరు లేక వెలవెలబోతున్న మంజీరా ప్రాజెక్టు
డెడ్ స్టోరేజ్ దిశగా సింగూరు ప్రాజెక్టు
వర్షాకాలంలోనే ఈ పరిస్థితి ఉంటే, రానున్న రోజుల్లో హైదరాబాద్ నగర ప్రజలకు కష్టకాలం తప్పదని హెచ్చరిస్తున్న నిపుణులు
కన్నెపల్లి వద్ద మోటార్లు ఆన్ చేసి నీటిని లిఫ్ట్ చేసి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదని విమర్శలు
— Telugu Scribe (@TeluguScribe) October 29, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Danger bells | తెలంగాణలో తరుముకొస్తున్న కరువు..! చుక్క నీరు లేక నెర్రెలు వాసిన ప్రాజెక్టులు, చెయ్యిచ్చిన కాంగ్రెస్ : వీడియో
Cult | ‘కల్ట్’ రిలీజ్ ట్రైలర్.. రక్తపాతం, భయంకరమైన హత్యలతో విశ్వక్ సేన్ విశ్వరూపం!
ISRO | మరో కీలక ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. శుక్రవారం రాత్రి నింగిలోకి దూసుకెళ్లనున్న జీఎస్సెల్వీ-ఎఫ్18..!
Sri Venkateswara Creations | భారీ సాహసానికి పూనుకున్న శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్.. ఒకేసారి నాలుగు క్రేజీ చిత్రాల డిస్ట్రిబ్యూషన్!
Jailer 2 | ‘జైలర్ 2’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా .. నవంబర్ 12 నుంచే స్ట్రీమింగ్ అంటూ ప్రచారం!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

