Vaibhav Sooryavanshi: చలినీళ్లు తాగకు.. సూర్యవంశీకి అభిమాని సలహా.. వీడియో
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఓ అభిమాని తల్లిలా సలహా ఇచ్చింది. చలినీళ్లు తాగవద్దు అని, వేడి చేసి చల్లార్చిన నీటిని తాగాలని చెప్పింది. వెల్లింగ్టన్లో మ్యాచ్ ముగిసిన తర్వాత ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్ అవుతోంది.
వెల్లింగ్టన్: వైభవ్ సూర్యవంశీ(Vaibhav Sooryavanshi) ఇప్పుడో సెన్షేషన్ క్రికెటర్. 15 ఏళ్ల వయసులోనే అతను జాతీయ జట్టుకు ఆడుతున్నాడు. రెండు రోజుల క్రితం వెల్లింగ్టన్లో న్యూజిలాండ్‌తో జరిగిన మూడవ టీ20 మ్యాచ్‌లో అతను శరవేగంగా 45 రన్స్ చేసిన విషయం తెలిసిందే. ఆ యువ క్రికెటర్‌ను ప్రతి ఒక్కరూ ఇష్టపడుతున్నారు. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత ఓ మహిళా అభిమాని వైభవ్ మీద ఎంతో ప్రేమను వ్యక్తం చేసింది. ఓ తల్లిలా సూచన చేసింది. మ్యాచ్ ముగిసిన తర్వాత స్టాండ్స్ వద్ద ఆటోగ్రాఫీ ఇస్తున్న సమయంలో సూర్యవంశీతో ఆమె మాట్లాడింది.
చలినీళ్లు తాగవద్దు అని, నీళ్లు వేడి చేసుకుని తాగుమని వైభవ్‌కు ఆమె సూచించింది. తల్లిలా ఆమె చేసిన సూచనను వైభవ్ స్వీకరించాడు. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. మేం కూడా బాలియా నుంచే వచ్చామని, యువ బ్యాటర్‌తో ఆ మహిళ పేర్కొన్నది. అయితే ప్రస్తుతం బాలియా ప్రాంతం యూపీలో ఉన్నది. బీహార్‌కు ఇది సరిహద్దు జిల్లా. వైభవ్‌ది బీహార్‌లోని సమస్తిపుర్ జిల్లా.
ఆటోగ్రాఫ్ ఇస్తూ ఆ మహిళ సూచనకు వైభవ్ స్పందించాడు. అచ్చా జీ , ఠీక్ హై అంటూ సూర్యవంశీ రియాక్ట్ అయ్యాడు.
From reminding him not to drink cold water to blessing him like a big sister, Vaibhav Suryavanshi is winning hearts both on and off the field ❤️
https://t.co/xmy98yFQeX— SaffronSoul (@TheRealDharm) October 28, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaibhav Sooryavanshi: చలినీళ్లు తాగకు.. సూర్యవంశీకి అభిమాని సలహా.. వీడియో
Millet Snacks | చిరుధాన్యాలతో చేసినంత మాత్రాన చిరుతిళ్లు ఆరోగ్యకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
Jailbreak | ఎమర్జెన్సీ నాటకమాడి ఖైదీలు జైలు నుంచి ఎలా తప్పించుకున్నారంటే..!
Danger bells | తెలంగాణలో తరుముకొస్తున్న కరువు..! చుక్క నీరు లేక నెర్రెలు వాసిన ప్రాజెక్టులు, చెయ్యిచ్చిన కాంగ్రెస్ : వీడియో
Cult | ‘కల్ట్’ రిలీజ్ ట్రైలర్.. రక్తపాతం, భయంకరమైన హత్యలతో విశ్వక్ సేన్ విశ్వరూపం!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

