Jailbreak | ఎమర్జెన్సీ నాటకమాడి ఖైదీలు జైలు నుంచి ఎలా తప్పించుకున్నారంటే..!
Jailbreak | తమిళనాడు (Tamil Nadu) లోని తేని జిల్లాలో సబ్‌జైలు (Theni Sub Jial) నుంచి ఖైదీల పరార్ కొన్ని గంటల్లోనే జరిగినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఓ 26 ఏళ్ల ఖైదీ పరారీకి ప్రణాళిక వేయగా.. మరో 26 ఏళ్ల ఖైదీ దాన్ని అమలు చేసినట్లు తేలింది. దర్యాప్తు అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సోమవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో పరారీకి ప్లాన్ చేయగా.. కేవలం మూడు గంటల్లో అంటే రాత్రి 10 గంటలకు ఆ ప్లాన్‌ను అమలుచేశారు.
Jailbreak : తమిళనాడు (Tamil Nadu) లోని తేని జిల్లాలో సబ్‌జైలు (Theni Sub Jial) నుంచి ఖైదీల పరార్ కొన్ని గంటల్లోనే జరిగినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఓ 26 ఏళ్ల ఖైదీ పరారీకి ప్రణాళిక వేయగా.. మరో 26 ఏళ్ల ఖైదీ దాన్ని అమలు చేసినట్లు తేలింది. దర్యాప్తు అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సోమవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో పరారీకి ప్లాన్ చేయగా.. కేవలం మూడు గంటల్లో అంటే రాత్రి 10 గంటలకు ఆ ప్లాన్‌ను అమలుచేశారు. తమ బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురవడంతో ఆగ్రహించిన ఖైదీలు అప్పటికప్పుడు కుట్రపన్ని జైలుసిబ్బందిపై దాడిచేసి పారిపోయారు.
వివరాల్లోకి వెళ్తే.. మదురైకి చెందిన 26 ఏళ్ల లింగ ప్రసాత్ అనే ఖైదీ ఈ పరారీ కుట్రకు సూత్రధారిగా దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఖైదీల్లో ఒకరం మూర్ఛ వచ్చినట్లు నాటకమాడితే సిబ్బంది సెల్ ఓపెన్ చేస్తారని, అదే సమయంలో అందరం మూకుమ్మడిగా దాడిచేసి పారిపోవచ్చని లింగ ప్రసాత్ ప్లాన్ చేశాడు. ఈ ప్లాన్ దోపిడీ కేసులో జైలుకు వచ్చినట్లు ముత్తు ఎలాంగోవన్ అమలు చేశాడు. ఎలాంగోవన్ మూర్ఛ వచ్చినట్లుగా కిందపడి కొట్టుకుంటుండగా సిబ్బంది జైలుగది తాళాలు తీసి చికిత్స నిమిత్తం అతడిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.
అదే సమయంలో ప్లాన్ ప్రకారం 17 మంది ఖైదీలు జైలు సిబ్బందిపై వంట సామాగ్రితో దాడిచేసి పరుగులుతీశారు. గేటు దగ్గర ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డగించగా వారిపై కూడా దాడిచేసి పారిపోయారు. కాగా పరారీ కుట్రకు సూత్రధారి లింగ ప్రసాత్పై వ్యవస్థీకృత నేరాలు, దోపిడీలు, దొంగిలించిన ఆస్తులను కలిగి ఉండటం, వాటిని విక్రయించడం వంటి కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. పారిపోయిన 17 మంది ఖైదీలను అధికారులు కేవలం 48 గంటల వ్యవధిలో అరెస్ట్‌చేసి తిరిగి జైలుకు తీసుకొచ్చారు. పరారీ కుట్రపై అధికారులు ప్రస్తుతం ఆ 17 మంది ఖైదీలను ప్రశ్నిస్తున్నారు.
ఘటన జరిగిన బ్లాక్‌లో మొత్తం 32 మంది ఖైదీలు ఉండగా వారిలో పదిహేడు మంది పారిపోయారు. అయితే పారిపోకుండా ఉన్న మిగతా 15 మంది ఖైదీల పాత్రను కూడా దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నారు. పారిపోయిన ఖైదీలకు వారు ఏమైనా సాయపడ్డారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లభించిన ఆధారాల ప్రకారం ఈ పలాయనం ముందుగా ప్రణాళిక వేసుకున్న చర్యకాదని, ఆ సాయంత్రం ఖైదీల మధ్య జరిగిన చర్చల క్రమంలో అప్పటికప్పుడు జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
ఆ బృందం తమ చర్యలను ఎలా సమన్వయం చేసుకుంది..? ఆ ప్రాంగణంలోని భద్రతాలోపాలను ఎలా ఉపయోగించుకుంది..? అనే విషయాలను దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలపై తొమ్మిదిమంది జైలు సిబ్బందిని సస్పెండ్ చేశారు. తమిళనాడు జైళ్లశాఖ రాష్ట్రంలోని అన్ని జైళ్లలో భద్రతా తనిఖీలు నిర్వహిస్తున్నది. ఈ నెలాఖరులోగా లోపాల విశ్లేషణను నిర్వహించాలని యోచిస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailbreak | ఎమర్జెన్సీ నాటకమాడి ఖైదీలు జైలు నుంచి ఎలా తప్పించుకున్నారంటే..!
Danger bells | తెలంగాణలో తరుముకొస్తున్న కరువు..! చుక్క నీరు లేక నెర్రెలు వాసిన ప్రాజెక్టులు, చెయ్యిచ్చిన కాంగ్రెస్ : వీడియో
Cult | ‘కల్ట్’ రిలీజ్ ట్రైలర్.. రక్తపాతం, భయంకరమైన హత్యలతో విశ్వక్ సేన్ విశ్వరూపం!
ISRO | మరో కీలక ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. శుక్రవారం రాత్రి నింగిలోకి దూసుకెళ్లనున్న జీఎస్సెల్వీ-ఎఫ్18..!
Sri Venkateswara Creations | భారీ సాహసానికి పూనుకున్న శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్.. ఒకేసారి నాలుగు క్రేజీ చిత్రాల డిస్ట్రిబ్యూషన్!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

