Kotagiri | కోటగిరి, జూలై 28 : కోటగిరి మండల కేంద్రంలో శ్రీ వేద పాఠశాల ఆధ్వర్యంలో మంగళవారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులు విద్యార్థులు బోనం ఎత్తుకొని గ్రామంలోని గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొక్కులు చెల్లించుకున్నారు. విద్యార్థులు పోతరాజుల వేషధారణలో అందరిని ఆకర్షించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా విద్యార్థులు బోనాల పండుగను నిర్వహించారు.
విద్యార్థుల వేషాధారణలు ప్రతీ ఒకరిని అలరించాయి. గ్రామంలోని అన్ని గ్రామదేవతలకు ఒడి బియ్యం చీరాసారలతో ముక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ వేద పాఠశాల డైరెక్టర్ తెల్ల రవికుమార్ కరస్పాండెంట్ అక్షర ఉపాధ్యాయ బృందం చంద్రకళ, సంగీత, సుప్రియ, పూజ, సావిత్రి, గంగాసాగరి, సంగీత, సువర్ణ, అశ్విని, సాయి, పవన్, సాయినాథ్, రాము, నాగరాజు, భీమ్రావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.