Lingampet | లింగంపేట్, ఏప్రిల్ 24 : లింగంపేట్ మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ఉగ్రవాదులు దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ పహల్గాం ప్రాంతంలో ఉగ్రవాదులు హిందువులను టార్గెట్ చేసి ప్రాణాలు తీయడం రేపటి తరానికి ముప్పుగా భావిస్తున్నామన్నారు. ఉగ్రవాదంపై వెంటనే ఉక్కు పాదం మోపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో లింగంపేట మండల అధ్యక్షులు బొల్లారం క్రాంతికుమార్, రాష్ట్ర నాయకులు బాపు రెడ్డి, జిల్లా ఓబీసీ మోర్చా మాజీ అధ్యక్షులు మహారాజుల మురళి, జిల్లా కార్యవర్గ సభ్యులు జక్సాని దత్తు, రాములు, వెంకట్రావు, జిల్లా మహిళా కార్యదర్శి పెద్ది సంగీత, మండల ప్రధాన కార్యదర్శులు విష్ణువర్ధన్, సుభాష్, బీజేవైఎం మండల అధ్యక్షులు రజనీకాంత్, ఓబీసీ మోర్చా మండలాధ్యక్షులు అందాల ఉదేష్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు రాజారాం, బాలయ్య, కిసాన్ సంఘ్ మండల అధ్యక్షులు చేకూరి పోశెట్టి, ఎస్టీ మోర్చ మండల అధ్యక్షులు లక్ష్మణ్ నాయక్, పట్టణ అధ్యక్షులు తిరుమల నరేష్, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.