కోటగిరి, మార్చి 21 : నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి ప్రభుత్వ దవాఖాన వరకు 34 ఫీట్ల సీసీ రోడ్డు వేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తూ శుక్రవారం కోటగిరి తాసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు ఏముల నవీన్ మాట్లాడుతూ.. ప్రభుత్వ స్కూల్ నుండి హాస్పిటల్ వరకు రోడ్డు గతంలో పోతంగల్ వెళ్లేoదుకు ప్రధాన రహదారి ఉండేదన్నారు. ప్రస్తుతం ఉన్న పోతంగల్ రోడ్డు వేశాక ఈ రోడ్డు ఎక్కువగా వాడక పోవడంతో ఓ వర్గం వారు రోడ్డును కబ్జా చేయాలనీ చూస్తున్నట్లు తెలిపారు.
33 ఫీట్ల రోడ్డు కబ్జాకు గురైందని తాసీల్దార్ సర్వే చేయించి రోడ్డు హద్దులను నిర్ణయించి వెంటనే రోడ్డు వేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక అధికార పార్టీ నాయకులు ఆ వర్గం నాయకుల ఓటు బ్యాంకు కోసం రోడ్డు కబ్జాపై నోరు మెదపడం లేదని అగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎన్ఆర్ఈజీఎస్, ఎస్సీ సబ్ ప్లాన్ కింద నిధులు మంజూరు అయ్యాయని, ఆ నిధులతో సీసీ రోడ్డు వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. లేదంటే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. డిమాండ్ తో కూడిన వినతి పత్రాన్ని గిర్ధావర్ సయ్యద్ హుస్సేన్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో మామిడి సాయిప్రసాద్, డాన్ రాజు, మామిడి శ్రీనివాస్, శ్యామ్, కాశి, నరేశ్, గంగాధర్, విట్టల్ పాల్గొన్నారు.
Kotagiri : స్కూల్ నుండి ఆస్పత్రి వరకు రోడ్డు వేయాలని బీజేపీ నాయకుల ధర్నా