బాన్సువాడ : నియోజకవర్గంలోని బాన్సువాడ ( Banswada ) పట్టణం చందూర్, మోస్రా మండలాల్లో బీజేపీ (BJP) నియోజకవర్గ నాయకులు శ్రీనివాస్ గార్గే ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం (Election Campaign) నిర్వహించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అంజిరెడ్డి చిన్నమైల్కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.
రాష్ట్రంలో బీజేపీ ప్రధాన ప్రతిపక్షం పాత్ర పోషిస్తుందతని, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తు ప్రజలను చైతన్యవంతులను చేస్తుందని శ్రీనివాస్ గార్గే అన్నారు. బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే శాసనమండలిలో నిరుద్యోగుల గొంతుకగా మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు సాయిరెడ్డి, భూపాల్ రెడ్డి, సుదర్శన్ గౌడ్, శ్రీనివాస్, సాయి, సురేష్ గౌడ్, గణేష్, భరత్ , తదితరులు పాల్గొన్నారు.