BHIKKANUR | భిక్కనూరు : భిక్కనూర్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మండల కేంద్రంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు ఉప్పరి రమేష్ బీజేపీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ఎల్లవేళలా దేశ ప్రజల అభివృద్ధికి బాటలు వేస్తుందని, అలాగే ప్రజల అవసరాలను తెలుసుకొని వారి సమస్యలు పరిష్కరించడానికి భవిష్యత్ తరాలు బాటలు వేస్తుందని చెప్పారు.
దానికి నిదర్శనమే ప్రధాని నరేంద్ర మోడీ రేషన్ షాపుల ద్వారా గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకంలో భాగంగా ప్రతి ఒక్కరికి ఐదు కిలోలు ఉచిత రేషన్ బియ్యాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. బీజేపీ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ద్వారా ప్రజలకు సేవలు అందించడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి అత్తేలి తిరుమలేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు బసవ రెడ్డి రవీందర్ రెడ్డి, కిసాన్ మోర్చా అధ్యక్షులు జైపాల్ రెడ్డి, జిల్లా ఓబిసి కార్యవర్గ సభ్యులు యాదగిరి గౌడ్, సుధాకర్, రంజిత్, కుమ్మరి, నరేందర్, మల్లారెడ్డి, నవీన్, బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.