Cybercrimes | ఆర్మూర్ టౌన్ : ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెరికిట్ ఉన్నత పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ అధ్యక్షతన విద్యార్థులకు ఆన్లైన్ మోసాలపై షీ టీం శ్రీ విగ్నేష్, సుమతి ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు.
ఇన్ స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇతర సోషల్ మీడియా వాడకం పట్ల అప్రమత్తంగా ఉండాలని అవగాహన అవగాహన కల్పించారు. సమాజంలో జరుగుతున్న ఆన్లైన్ మోసాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.