తీరొక్క పూలను తెచ్చి, బతుకమ్మగా తీర్చిదిద్ది, పసుపుముద్దతో తయారు చేసిన గౌరమ్మను పెట్టి భక్తితో కొలిచే వేడుక బతుకమ్మ పండుగ. తొమ్మిది రోజుల పాటు మహిళలు నిండు మనస్సుతో ప్రకృతిని కొలిచే వేడుక బతుకమ్మ.
మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మను ఆరాధించిన అతివలు.. రెండో రోజైన గురువారం అటుకుల బతుకమ్మను భక్తితో కొలిచారు. ఉమ్మడి జిల్లాలోని ఊరూవాడ మహిళల సందడితో మార్మోగింది. బతుకమ్మ పాటలకు అనుగుణంగా లయబద్ధంగా వేసిన స్టెప్పులతో పుడమి పులకించింది.
– బోధన్, అక్టోబర్ 3