Nizamabad | రుద్రూర్/కోటగిరి : అణగారిన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ అని పలువురు నాయకులు కొనియాడారు. ఆయన జయంతి సందర్భంగా శనివారం రుద్రూరు, కోటగిరి మండలాల్లో ఆయనకు నివాళులర్పించారు.
రుద్రూరు మండల కేంద్రంలో జగ్జీవన్ రాము విగ్రహానికి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శేఖర్ ఆధ్వర్యంలో నాయకులు, సంజీవ్ రెడ్డి, అరుణకుమార్, కార్తీక్, నరేష్, నిస్సర్, అంబం, విలేజ్ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ సంతోష్, ఆర్ పోచయ్య, ఆర్ సాయిలు, కండక్టర్ గంగలి రాములు, ఆసం రాము, పున్న పురుగయ్య, రామసాని చిన్ను (రైతు), ఆర్ ఎల్లయ్య, షేక్ అల్లావుద్దీన్, అఫ్సర్, రామసాని సాయిరాం పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కోటగిరిలో..
కోటగిరి మండలంలోని నిర్వహించిన కార్యక్రమంలో కోటగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతు, వైస్ చైర్మన్ అనిల్ కులకర్ణి, కోటగిరి విండో చైర్మన్ కూచి సిద్దు, మాజీ ఎంపీటీసీ కొట్టం మనోహర్, తెల్ల రవికుమార్, బర్ల మధు, ఎమ్మార్పీఎస్ నాయకులు కన్నం దావులయ్య, బీ సాయిలు,కన్నం సాయిలు,దినేష్,శ్రీకాంత్, పోశెట్టి,లాలయ్య, గంగారం, అబ్బయ్య తదితరులు బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.