రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి
గ్రామ గ్రామాన కారు, సారు, కేసీఆర్ అంటున్నారని, రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ కోసం 365 రోజులు నిరంతరం కష్టపడతామని, కేసీఆర్ మళ్లీ సీఎం అయ్యేవరకూ పోరాడుతామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తెలంగాణ ప్రజల గుండెల్లో సువర్ణక్షరాలతో లిఖించబడ్డ రోజన్నారు.
- తెలంగాణ ప్రజలు కేసీఆర్ పాలన కోరుకుంటున్నారు..
- ప్రతి ఇంట్లో ఆనందం నింపిన తొలి ముఖ్యమంత్రి
- బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి
- పార్టీ జిల్లా కార్యాలయంలో ‘ఆవిర్భావ’ వేడుకలు
ఖలీల్‌వాడి, ఏప్రిల్ 27 : గ్రామ గ్రామాన కారు, సారు, కేసీఆర్ అంటున్నారని, రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ కోసం 365 రోజులు నిరంతరం కష్టపడతామని, కేసీఆర్ మళ్లీ సీఎం అయ్యేవరకూ పోరాడుతామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తెలంగాణ ప్రజల గుండెల్లో సువర్ణక్షరాలతో లిఖించబడ్డ రోజన్నారు.
జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో సోమవారం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జీవన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై గులాబీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడు తూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక పార్టీలు వచ్చాయని, తుంగలో పుట్టి గంగలో కలిసిపోయాయన్నారు. విజయశాంతి నుంచి కోదండరాం, దేవేందర్‌గౌడ్ వరకు అనేక మంది తెలంగాణపేరు మీద పార్టీలు పెట్టారని, కానీ నిలబడ్డ పార్టీ ఏదీ లేదన్నారు. తెలంగాణను సాధించిన ఫాదర్ ఆఫ్ తెలంగాణ కేసీఆర్ అని తెలిపారు. తెలంగాణ సాధించిన తర్వాత ప్రతి ఇంట్లో ఆనందాన్ని నింపిన వ్యక్తి కేసీఆర్ అని పేర్కొన్నారు. 65లక్షల మంది రైతులను ఆదుకున్న ఏకైక సీఎం కేసీఆర్ అని తెలిపారు.
రైతులకు రైతుబంధు, రైతుబీమా, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు అందించారన్నా రు. 24 గంటలు 365 రోజులు కరెంట్ ఇచ్చిన గొప్ప నాయకుడని, ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద రూ.లక్షా 116 లు అందించి వారి కుటుంబాన్ని ఆదుకున్నారని వివరించారు. తెలంగాణ అనే పదం కేసీఆర్‌కే అంకితమని పేర్కొన్నారు. కేసీఆర్ లేకుంటే కవిత ఎక్కడ అని, తెలంగాణ ఎక్కడ తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కన్న తండ్రిని విమర్శిస్తారా, కేసీఆర్ లేకుంటే కవిత ఎంపీ, ఎమ్మెల్సీ అయ్యేదేనా అని ప్రశ్నించారు. పార్టీలు ఎవరైనా పెట్టుకోవచ్చని, కానీ కేసీఆర్‌ను విమర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ నిజామాబాద్ రూరల్ ఇన్చార్జి బాజిరెడ్డి జగన్, పార్టీ నగర అధ్యక్షుడు సిర్ప రాజు, సుజిత్‌సింగ్ ఠాకూ ర్, సత్యప్రకాశ్, అభిలాష్‌రెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

