ఆశ’పెట్టి.. హామీని ఎండబెట్టి!
ఆశ వర్కర్లకు ఉమ్మడి రాష్ట్రంలో నెలకు రూ.1500 మాత్రమే వేతనం చెల్లింపులు జరిగేవి. జీతాల పెంపుకై రోడ్డెక్కి ధర్నాలు చేసినప్పటికీ నాటి పాలకులు పట్టించుకోలేదు. స్వరాష్ట్రం ఏర్పడిన కొత్తలో సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే కేసీఆర్ మానవత్వాన్ని చూపారు.
- ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకై ఉద్యమం
- కనీస వేతనం రూ.18వేలు ఇవ్వాలని ఆందోళన
- అడుగడుగునా ప్రభుత్వ పెద్దలను నిలదీస్తోన్న వైనం
- ఆశలపై కర్కషంగా వ్యవహరిస్తోన్న కాంగ్రెస్ సర్కార్
నిజామాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆశ వర్కర్లకు ఉమ్మడి రాష్ట్రంలో నెలకు రూ.1500 మాత్రమే వేతనం చెల్లింపులు జరిగేవి. జీతాల పెంపుకై రోడ్డెక్కి ధర్నాలు చేసినప్పటికీ నాటి పాలకులు పట్టించుకోలేదు. స్వరాష్ట్రం ఏర్పడిన కొత్తలో సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే కేసీఆర్ మానవత్వాన్ని చూపారు.
తెలంగాణలోని ఆశ వర్కర్లకు అమలవుతోన్న నెలవారీ జీతాన్ని భారీగా పెంచారు. తెలంగాణ ఏర్పడిన వెంటనే వేతనాన్ని రూ.3వేలకు ఆ తర్వాత రూ.7,500లకు పెంచారు. రోడెక్కి ధర్నాలు చేయాల్సిన అవసరం లేకుండానే, దరఖాస్తులిచ్చి దండం పెట్టే బాధలు లేకుండానే వేతనాలను పెంపును అమలు చేసి పెద్ద మనసును చాటుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సరిసమానంగా పీఆర్సీని అమలు చేయడం ద్వారా వారి వేతనం ఇప్పుడు రూ.9,750 లకు చేరిందంటే ఇందుకు కేసీఆర్ ప్రభుత్వ చర్యలే కారణం. ఆశ వర్కర్లకు సమయానికి వేతనాలు చెల్లించే విధంగా వ్యవస్థను తీర్చిదిద్దారు.
ఠంచనుగా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా బ్యాంకుల్లో జమ అయ్యేలా సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఆశలకు కొండంత అండగా కేసీఆర్ నిలవగా… ప్రస్తుతం పెద్ద దిక్కు లేకుండా పోయింది. జీతాలు సరైన సమయానికి పడకపోవడంతో పాటుగా వారికి మేలు చేస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ కనీసం పట్టించుకోవడం లేదు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

