నిజామాబాద్ క్రైం, ఫిబ్రవరి 5 : నిజామాబాద్ జి ల్లా కేంద్రంలో అక్రమంగా లక్కీ డ్రా నిర్వహిస్తున్న స్థావరంపై సౌత్ రూరల్ సీఐ జగడం నరేశ్, ఆరో టౌన్ ఎస్సై ఆంజనేయులు సిబ్బందితో కలిసి శనివారం దాడి చేశారు. కొంతకాలంగా బహుమతుల ఆశ చూపించి ప్రతినెలా ప్రజల నుంచి లక్కీ డ్రాల పేరిట లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. అలాంటి కోవకే చెందిన సూపర్ టైమ్ ఎంటర్ ప్రైజెస్ సుమారు 300 మంది సభ్యుల నుంచి డ బ్బులు వసూలు చేశారు. నగరానికి చెందిన యువకులు ఈ ఎంటర్‌ప్రైజెస్‌ను ఏర్పాటు చేసి అందులో మూడు వేల మంది సభ్యులను చేర్చుకొనేందుకు ప్రయత్నించారు. కానీ వారు అనుకున్న మేర స భ్యులు చేరలేదు.
300 మంది సభ్యులను అందు లో చేర్చుకున్నారు. ఈ లక్కీ స్కీమ్‌లో సభ్యులుగా చేరిన సభ్యులు ప్రతి నెలా వేయి రూపాయల చొప్పున చెల్లిస్తారు. ప్రతి నెలా నిర్వాహకులు డ్రా నిర్వహిస్తూ ఏదో ఒక బహుమతి అందజేస్తారు. ఈ ఎంటర్ ప్రైజెస్ నిర్వాహకులు 18 నెలలుగా 300 మంది సభ్యుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం రూ.54 లక్షలు వసూలు చేశారు. ఈ రోజు లక్కీ డ్రా స్కీమ్ చివరి నెల కావడంతో ఎవరికీ అనుమానం కలుగకుండా నిర్వాహకులు నగర శివారులోని అర్సపల్లి పరిధిలోని తాజ్ దాబా వద్ద ఓ ఇంటిని అద్దెకు తీసుకొని అందులో డ్రా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. విషయం తెలియడంతో సౌత్ రూరల్ సీఐ నరేశ్ సిబ్బందితో కలిసి దాడి చేశారు.
ఈ దాడిలో నిర్వాహకులు షేక్ ఆసిఫ్, సయ్యద్ ముజాయిద్, సయ్యద్ ముజాయిద్ నౌమాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సూపర్ టైమ్ ఎంటర్‌ప్రైజెస్‌కు సంబంధించిన బ్రోచర్లు, లక్కీ డ్రా తీసేందుకు వినియోగించే కాయిన్స్‌తో పాటు ఫర్నిచర్‌ను సీజ్ చేసినట్లు సీఐ నరేశ్ వెల్లడించారు. వీరిపై ఆరో టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
నిజామాబాద్ నగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో పలువురు యువకులు ‘ షైన్ ఎంటర్ ప్రైజెస్’ పేరుతో ఇలాంటి లక్కీ డ్రా స్కీమ్ ను కొనసాగించారు. ఇందులో కూడా నిర్వాహకులు 3 వేల మంది సభ్యులను చేర్పించుకొని వారి నుంచి నెలకు వేయి రూపాయల చొప్పున వసూలు చేశారు.
ఈ స్కీమ్ నిర్వాహకులు సైతం తమ సభ్యులకు డ్రాలో గెలుపొందిన వారికి ఆకర్షణీయమైన బహుతుల ఆశ చూపించి సుమారు 4 కోట్ల రూపాయల వరకు వసూలు చేశారు. నిర్వాహకులు చివరి సమయంలో పరార్ కావడంతో అందులో డబ్బులు కట్టిన సభ్యులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. పలువురు బాధితులు నిజామాబాద్ ఏసీపీ ఏ.వెంకటేశ్వర్‌ను ఆశ్రయించి తమ గోడు వెల్లబోసుకున్నారు. పరారీలో ఉన్న నిర్వాహకులపై వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు.
సూపర్ టైమ్ ఎంటర్ ప్రైజెస్ పేరుతో అక్రమంగా నిర్వహించిన బంపర్ స్కీమ్‌లో డబ్బులు చెల్లించి మోసపోయిన వారు నేరుగా తమ వద్దకు వచ్చి ఫిర్యాదు చేయాలని సౌత్ రూరల్ సీఐ నరేశ్ తెలిపారు. బహుమతుల ఆశ చూపించి జనాన్ని మో సం చేసిన వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా సీఐ బాధితులకు భరోసా ఇచ్చారు.