సుభాష్‌నగర్, ఆగస్టు 14: పంద్రాగస్టు ఉత్సవాలు గురువారం ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పా ట్లు పూర్తిచేశారు. నగరంలోని పోలీస్ పరేడ్ మైదానాన్ని ముస్తాబు చేశారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు.
శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలకు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై స్టాళ్ల ప్రదర్శన చేపడుతున్నారు. పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వనున్నారు.