Nizamabad | వినాయక్ నగర్, జూన్ 15 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉమ్మడి జిల్లా పోలీస్ సిబ్బంది ఆదివారం అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న 2000 సంవత్సరం కానిస్టేబుల్ బ్యాచ్ బ్యాచ్ కు చెందిన సిబ్బంది ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ హోటల్ లో సిబ్బంది 25 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ జరుపుకున్నారు.
గత 25 సంవత్సరాల క్రితం పోలీస్ శాఖలో చేరిన సిబ్బంది విధి నిర్వహణలో భాగంగా ఉమ్మడి జిల్లాలో వేరువేరు ప్రాంతాలలో ఉంటూ డ్యూటీలు చేస్తున్నారు. ట్రైనింగ్ సమయంలో కలిసిన సిబ్బంది మళ్లీ ఈరోజు ఒకే చోట చేరడంతో అందరూ సంతోషంగా తమ బాగోగులు చర్చించుకున్నారు. 25 సంవత్సరాల అనంతరం ఇంతమంది మిమ్మల్ని ఒకే చోట కలవడం ఎంతో సంతోషంగా ఉందని పలువురు సిబ్బంది వర్షం వ్యక్తం చేశారు.