Nizamsagar | నిజాంసాగర్ : కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం నిజాంసాగర్ మండల కేంద్రంలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ అంబేద్కర్ విగ్రహానికి శనివారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సేవలను కొనియాడారు. సమానత్వం, న్యాయం, హక్కుల కోసం అంబేద్కర్ చూపిన మార్గం నేటికీ ప్రతీ భారతీయుడికి ప్రేరణ, ఆయన ఆలోచనలు యువతలో మరింతగా వ్యాప్తి చెందాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్, సీనియర్ నాయకులు, గ్రామ అధ్యక్షుడు, యువజన కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ను స్మరించుకున్నారు.