AITUC | కోటగిరి : నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 20న నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా నాయకులు విఠల్ గౌడ్ కార్మికులకు పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సమ్మె వాల్ పోస్టర్లను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా నాయకులు విట్టల్ గౌడ్ మాట్లాడుతూ 11 సంవత్సరాల నుండి బిజెపి ప్రభుత్వ పాలనలో కార్మిక చట్టాలను తుంగలో తొక్కేసిందన్నారు.
బిజెపి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి అన్ని రకాల వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి పేద కార్మికుల పై భారం పడిందన్నారు. అన్ని రకాల వస్తువుల ధరలు పెరుగుతున్న కార్మికుల జీతాలు మాత్రం పెరగడం లేదని మండిపడ్డారు. కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా, కార్మిక వ్యతిరేక విధానాలను బిజెపి ప్రభుత్వం అవలంబిస్తుందన్నారు. కార్మికులకు పని గంటల పెంచడంపై వాటికి వ్యతిరేకంగా ఈనెల 20న జాతీయ కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా సమ్మె చేపట్టిందని ఈ సమ్మెలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ నాయకులు సాయిలు, వీరేశం, రాజు, గోపి, రాములు తదితరులు పాల్గొన్నారు.