Adivasi Day | కంటేశ్వర్, ఆగస్టు 9 : నిజామాబాద్ పట్టణంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఆదివాసీ నాయకపోడ్ తెగకు చెందిన వారు ఆదివాసీ దినోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ పట్టణంలోని వినాయకనగర్ యందు ఉన్న ఆదివాసీల పోరాటయోధుడు స్ఫూర్తి ప్రదాత అయినటువంటి కొమరం భీం విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించి జెండాను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విట్టల్ రావు, బీఆర్ఎస్ నాయకుడు బాజిరెడ్డి జగన్ , జిల్లా డీటీడబ్ల్యూవో అధికారి నాగోరావు, జిల్లా ఆదివాసీ నాయకపోడు సేవా సంఘం అధ్యక్షుడు గాండ్ల రామచందర్, గౌరవ అధ్యక్షుడు బండారి భోజన్న, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో సాయన్న, ధాత్రి
అంజయ్య,శానం పవన్ కుమార్, జిల్లా అధికారి ప్రతినిధి పుట్ట దుర్గ మల్లేష్ , కొండ శ్రీనివాస్, తౌడ గారి చిన్న విట్టల్ కొండూరు మాజీ సర్పంచ్ అశోక్ , మాజీ ఎంపీటీసీ అన్నం సాయిలు, తదితరులు పాల్గొనడం జరిగింది.
Shivraj Singh Chouhan: చెట్టుకు రాఖీ కట్టిన కేంద్ర మంత్రి శివరాజ్.. వీడియో