బాన్సువాడ రూరల్ : బాన్సువాడ (Banswada) మండలం హన్మాజిపేజీ – పైడిమల్ గ్రామ శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) మండలంలోని కోనాపూర్ గ్రామానికి చెందిన గైని సాయిలు (28) మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోనాపూర్ గ్రామానికి చెందిన సాయిలు వర్ని మండలం పైడిమల్ గ్రామానికి ద్విచక్రవాహనంపై (Two Wheelers) వెళ్తుండగా ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీ కొట్టింది. బైక్ పై నుంచి కింద పడిన సాయిలు తలకు బలమైన గాయం తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నట్లు బంధువులు తెలిపారు. మృతదేహాన్ని బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.