Exam results | పెద్ద కొడప్ గల్, ఏప్రిల్ 30 : రాష్ర్ట ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన పదో తరగతి పరీక్ష ఫలితాలల్లో కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండలంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలకు జే లావణ్య 541/600 మార్కులు సాధించి మండల మండల స్థాయిలో ప్రథమ ప్రథమ స్థానంలో నిలిచింది.
మండలంలో మొత్తం 213 విద్యార్థులు పదవ తరగతి పరీక్షలకు హాజరు కాగా 184 మంది ఉత్తీర్ణులై 86.4 శాతం ఉత్తీర్ణత శాతం సాధించినట్లు ఎంఈఓ ప్రవీణ్ కుమార్ తెలిపారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కాటేపల్లి పాఠశాలకు చెందిన విద్యార్థి ఏ లావణ్య 516/600 రెండో స్థానంలో జిల్లా పరిషత్ ఉన్నత ప్రాథమిక పాఠశాల వడ్లం పాఠశాలకు చెందిన విద్యార్థి బీ సునీత 513/600 మార్కులు సాధించి మూడో స్థానంలో నిలిచినట్లు తెలిపారు.
కాటేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు 100శాతం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పెద్ద కొడంగల్ 75శాతం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు వడ్లం 95శాతం, సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు 88శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈఓ ప్రవీణ్ కుమార్ తెలిపారు.