Suicide | బాల్కొండ : నిజామాబాద్ జిల్లా పరిధిలోని బాల్కొండ గ్రామానికి చెందిన వేంపల్లి కృష్ణ అలియాస్ నరసయ్య (46) ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాల్కొండ గ్రామానికి చెందిన వేంపల్లి నరసయ్య వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే కుటుంబ సమస్యల కారణంగా జీవితంపై విరక్తి చెంది శుక్రవారం ఉదయం తన వ్యవసాయ పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. రాత్రి 11 గంటలకు ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి భార్య వేంపల్లి సాయమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాల్కొండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి.