నిజామాబాద్ : తోడేళ్ల దాడిలో ఓ కృష్ణ జింక మృతి చెందింది. ఈ సంఘటన జిల్లాలోని నందిపేట మండలం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ సిద్దాపూర్ శివారులో చోటు చేసుకుంది. పశువుల కాపరులు గమనించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పశువైద్యాధికారులు సంఘటనా స్థలంలోనే కృష్ణ జింకకు పోస్టుమార్టం నిర్వహించారు.