మంగళవారం 19 జనవరి 2021
Nirmal - Jun 08, 2020 , 01:39:47

మెరుగైన వైద్య సేవలందించాలి

మెరుగైన వైద్య సేవలందించాలి

డీఎంఅండ్‌హెచ్‌వో నరేందర్‌

ఎదులాపురం :  మెరుగైన వైద్యసేవలందించాలని ప్రభుత్వ వైద్యులు, సిబ్బందికి డీఎంఅండ్‌ హెచ్‌ఓ నరేందర్‌ రాథోడ్‌ ఆదేశించారు. ఆదివా రం  జిల్లా కేంద్రంలోని (ఎన్‌హెచ్‌ఎం)లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  జిల్లాలో అమలవుతున్న పథకాలను పవర్‌ పా యింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా తెలుసుకున్నారు. కేసీఆర్‌ కిట్‌, కుటుంబ నియంత్రణ , టీబీ, కుష్ఠు, ఎయిడ్స్‌  వ్యాధిగ్రస్థులకు అందుతున్న సేవల  వివరాలను అడిగి తెలుసుకున్నారు. గర్భిణులు, చిన్నపిల్లలు, క్రమం తప్పకుండా టీకాలు వేయించుకుంటున్నారా ?  కేసీఆర్‌ కిట్‌   ఇస్తున్నారా ? డబ్బులు వారి అకౌంట్‌లో జమ అవుతున్నాయా ? అని తెలుసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ  పథకాలను అర్హులందరికీ అందేలా చూడాలన్నారు. వైద్య సేవల్లో ఆదిలాబాద్‌ జిల్లాను  రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.  ఈ  సమావేశంలో  జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి  శ్రీకాంత్‌, డాక్ట ర్‌ వైసీ శ్రీనివాస్‌, ఎన్‌హెచ్‌ఎం డీపీఎం స్వా మి, డీడీఎం వెంకటరమణ పాల్గొన్నారు.