బుధవారం 01 ఏప్రిల్ 2020
Nirmal - Mar 06, 2020 , 23:58:27

నాణ్యమైన విత్తనాలు సేకరించాలి

నాణ్యమైన విత్తనాలు సేకరించాలి

బోథ్‌, నమస్తే తెలంగాణ: రైతులు నాణ్యమైన శనగ విత్తనాలు సేకరించాలని తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ రీజినల్‌ మేనేజర్‌ అతుల్‌కుమార్‌ జైన్‌ సూచించారు. మండలంలోని కౌఠ (బీ) గ్రామంలో శుక్రవారం విత్తనోత్పత్తి పథకం కింద రైతులు సాగు చేస్తున్న శనగ పంట పొలాలను ఫ్లాంట్‌ ఇంజినీరింగ్‌ విభాగం అధికారి రాహుల్‌తో కలిసి సందర్శించారు. ఈ  సందర్భంగా ఆర్‌ఎం మాట్లాడుతూ... విత్తనోత్పత్తి కింద రైతులకు జాకి, జేజే-11 రకం విత్తనాలను అందించామన్నారు. ప్రస్తుతం పంట కోతకు వచ్చినందున రైతులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పంటలో బెరుకులను తొలగించాలన్నారు. ఇతర రకాల విత్తనాలు కలువకుండా చూసుకోవాలన్నారు. నూర్పిడి సమయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. విత్తన పైపొర తొలగిపోకుండా ఉండేందుకు ఎక్కువ సమయం ఎండలో ఆరబెట్టవద్దన్నారు. అనంతరం రైతులకు పలు సూచనలు అందించారు. ఆయన వెంట శ్రమశక్తి రైతు సంక్షేమ సంఘం సభ్యులు ఎన్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌.లింగారెడ్డి, రైతులు ఎడ్మల రమణారెడ్డి, ఎస్‌ పవన్‌రెడ్డి, ఎన్‌.రంజిత్‌రెడ్డి, బి.రాకేశ్‌రెడ్డి, ఎస్‌.రమేశ్‌రెడ్డి, ఎం.జగదీశ్వర్‌రెడ్డి, ఇట్టెడి రాజు ఉన్నారు. 


logo
>>>>>>