మంగళవారం 09 మార్చి 2021
Nipuna-education - Jan 17, 2021 , 00:36:29

డిజిటల్‌ పేమెంట్‌ ఇండెక్స్‌కు ఆధార సంవత్సరం?

డిజిటల్‌ పేమెంట్‌ ఇండెక్స్‌కు ఆధార సంవత్సరం?

1. కింది వాక్యాలను పరిశీలించండి (సి)

1. ప్రపంచ బ్యాంక్‌ ఇచ్చిన నివేదిక ప్రకారం 2020-21లో భారత వృద్ధి 9.6% మేర కుంచించుకుపోతుంది

2. జాతీయ గణాంక కార్యాలయం ప్రకారం 2020-21 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి 7.7% క్షీణించే అవకాశం ఉంది

పై వాటిలో సరైనది ఏది?

ఎ) 1   బి) 2   సి) 1, 2  డి) ఏదీకాదు

వివరణ: గ్లోబల్‌ ఎకనామిక్‌ ప్రాస్పెక్ట్స్‌ పేరుతో ప్రపంచ బ్యాంక్‌ ఒక నివేదికను విడుదల చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 9.6% మేర కుంచించుకుపోతుందని పేర్కొంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 5.4 శాతం మేర వృద్ధి ఉంటుందని అంచనా వేసింది. మరోవైపు జాతీయ గణాంక కార్యాలయం కూడా 2020-21 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి 7.7% క్షీణించే అవకాశం ఉందని పేర్కొంది. 

2. ప్రపంచ బ్యాంక్‌ గ్లోబల్‌ ఎకనామిక్‌ ప్రాస్పెక్ట్స్‌ నివేదిక ప్రకారం భారత వృద్ధి రేటు కుంచించుకు పోవడానికి కారణాలు? (డి)

1. గృహరంగ వినియోగం తగ్గడం 

2. ప్రైవేట్‌ పెట్టుబడులు తగ్గడం

ఎ) 1   బి) 2   సి) ఏదీకాదు   డి) 1, 2

వివరణ: గృహ రంగ వినియోగ వ్యయం, ప్రైవేట్‌ పెట్టుబడులు తగ్గడం వల్ల భారత ఆర్థిక వృద్ధి కుంచించుకుపోతుందని ప్రపంచ బ్యాంక్‌ నివేదిక పేర్కొంది. కరోనా నేపథ్యంలో అసంఘటిత రంగం పూర్తిగా దెబ్బతిన్నది. ఇది ఉద్యోగాల కల్పనలో 4/5వ వంతు ఉంది. దీంతో ప్రజల కొనుగోలు శక్తి కూడా తగ్గిందని నివేదిక పేర్కొంది. 

3. జాతీయ గణాంక కార్యాలయం ఇచ్చిన నివేదిక ప్రకారం ఏ రంగం ఈ ఏడాది వృద్ధిని నమోదు చేయవచ్చు? (సి)

ఎ) తయారీ రంగం బి) మైనింగ్‌

సి) వ్యవసాయ రంగం

డి) నిర్మాణ రంగం

వివరణ: వ్యవసాయ రంగం ఒక్కటే 3.4% వృద్ధిని నమోదు చేయొచ్చని జాతీయ గణాంక కార్యాలయం జనవరి 7న విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. మైనింగ్‌, క్వారీయింగ్‌, వాణిజ్యం, హోటళ్లు, రవాణా, కమ్యూనికేషన్‌, ప్రసార సేవల్లో ఎక్కువ క్షీణత ఉంటుంది. నిర్మాణ రంగం కూడా 12.6 శాతానికి ప్రజాపరిపాలన, రక్షణ ఇతర సేవలు మైనస్‌ 3.7 శాతానికి తగ్గుతాయని పేర్కొంది.

4. ప్రతిపాదన (ఏ): ఆర్‌బీఐ ‘కాలేజ్‌ ఆఫ్‌ సూపర్‌విజన్‌'ను ఏర్పాటు చేసింది (ఎ)

కారణం (ఆర్‌): నియంత్రణను మరింత బలోపేతం చేయాలని ఆర్‌బీఐ భావిస్తుంది

ఎ) ఏ, ఆర్‌ సరైనవే. ఏ ను ఆర్‌ సరిగ్గా  వివరిస్తుంది

బి) ఏ, ఆర్‌ సరైనవే. ఏ కు ఆర్‌ సరికాదు

సి) ఏ సరైనది, ఆర్‌ సరికాదు

డి) ఏ తప్పు, ఆర్‌ సరైనది

వివరణ: నియంత్రణను మరింత బలోపేతం చేయడానికి ఆర్‌బీఐ కాలేజ్‌ ఆఫ్‌ సూపర్‌ విజన్‌ను ఏర్పాటు చేసింది. ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ ఎన్‌ఎస్‌ విశ్వనాథన్‌ చైర్‌పర్సన్‌గా, రబీ నారాయణ్‌ మిశ్రా డైరెక్టర్‌గా ఉన్నారు. దేశంలోని నియంత్రణ స్థానాల్లో ఉన్న వ్యవస్థల పనితీరును మరింత మెరుగుపరిచేందుకు ఇది కృషి చేస్తుంది.

5. శివాలిక్‌ మర్కంటైల్‌ కోఆపరేటివ్‌ బ్యాంక్‌ ఇటీవల వార్తల్లో నిలవడానికి కారణం? (బి)

ఎ) ఈ బ్యాంకును ఎస్‌బీఐలో విలీనం చేశారు                      

బి) స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకుగా మారబోతున్న తొలి పట్టణ సహకార బ్యాంక్‌

సి) పేమెంట్‌ బ్యాంకుగా శివాలిక్‌ మర్కంటైల్‌ను మార్చారు              డి) ఏదీకాదు

వివరణ: శివాలిక్‌ మర్కంటైల్‌ కో ఆపరేటివ్‌ బ్యాంకును శివాలిక్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకుగా మారుస్తూ ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. ఈ ఘనత సాధించిన తొలి పట్టణ సహకార బ్యాంకుగా శివాలిక్‌ మర్కంటైల్‌ బ్యాంక్‌ ఘనత సాధించింది. ఏప్రిల్‌ 2021 నుంచి ఈ బ్యాంక్‌ కార్యకలాపాలను నిర్వహిస్తుంది.

6. భారత్‌ ఇటీవల ఏర్పాటు చేసిన సౌత్‌ ఏషియా గ్రూప్‌ ఫర్‌ ఎనర్జీకి ఎవరు నేతృత్వం వహిస్తారు? (సి)

ఎ) వినయ్‌ కుమార్‌        

బి) బిల్లా అనిరుధ్‌

సి) రామ్‌ వినయ్‌ షాహీ

డి) కుమార్‌ భాటియా

వివరణ: శక్తి రంగంలో మౌలిక సదుపాయాలను పరస్పరం అవగాహన, సహకారంతో బలోపేతం చేసుకోవాలని భారత దేశం సౌత్‌ ఏషియా గ్రూప్‌ ఫర్‌ ఎనర్జీని ఏర్పాటు చేసింది. దీనికి కే్రంద విద్యుత్‌ శాఖ మాజీ కార్యదర్శి రామ్‌ వినయ్‌ షాహీ నేతృత్వం వహిస్తారు. విదేశాంగ మంత్రిత్వ శాఖలో ఇది ఒక మేధోపరమైన సంస్థగా పనిచేస్తుంది. 

7. ఎంత మేర నగదు బదిలీ మించితే లీగల్‌ ఎంటైటీ ఐడెంటిఫయర్‌ అవసరమని ఆర్‌బీఐ పేర్కొంది? (డి)

ఎ) రూ.10 కోట్లు          బి) రూ.30 కోట్లు           సి) రూ.40 కోట్లు          డి) రూ.50 కోట్లు 

వివరణ: రూ.50 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ నగదును ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు బదిలీ చేస్తే లీగల్‌ ఎంటైటీ ఐడెంటిఫయర్‌ కచ్చితంగా అసరమని ఆర్‌బీఐ పేర్కొంది. ఈ నిబంధనను జనవరి 5న విడుదల చేసింది. లీగల్‌ ఎంటైటీ ఐడెంటిఫయర్‌ (ఎల్‌ఈఐ) అన్నది 20 సంఖ్యలు ఉండే ఒక సంఖ్య. ఎల్‌ఈఐని దశలవారీగా ఆర్‌బీఐ ప్రవేశపెట్టింది.

8. ముంబై, చెన్నై, దీన్‌దయాళ్‌, పారాదీప్‌, కోల్‌కతాల నౌకాశ్రయాల్లో రూ.320 కోట్లతో ఏ ప్రాజెక్టును అమలు చేయాలని నిర్ణయించారు? (ఎ)

     ఎ) డిజిటల్‌ వ్యవస్థను అందుబాటులోకి  తేవడం         

బి) ఈ పోర్టులకు ప్రత్యేక అనుసంధానం చేయడం         

సి) ఈ పోర్టుల నుంచి ఎగుమతులకు పన్ను రాయితీ     డి) ఏదీకాదు

వివరణ: ముంబై, చెన్నై, దీన్‌దయాళ్‌, పారాదీప్‌, కోల్‌కతాల నౌకాశ్రయాల్లో రూ.320 కోట్లతో డిజిటల్‌ చెల్లింపుల సామర్థ్యాన్ని అందుబాటులోకి తేవాలని కేంద్రం నిర్ణయించింది. స్థానిక అవసరాలను దృష్టిలో పెట్టుకోవడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో ఉన్న ఉత్తమ విధానాలను అవలంబిస్తారు. 

9. ప్రతిపాదన (ఏ): ఖాదీ అండ్‌ విలేజ్‌ ఇండస్ట్రీస్‌ కమిషన్‌ (కేవీఐసీ) eKhadiIndia.com అనే పోర్టల్‌ను ప్రారంభించింది (ఎ)

కారణం (ఆర్‌): గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇవ్వాలని కేవీఐసీ భావిస్తుంది.

ఎ) ఏ, ఆర్‌ సరైనవే. ఏ ను ఆర్‌ సరిగ్గా  వివరిస్తుంది

బి) ఏ, ఆర్‌ సరైనవే. ఏ కు ఆర్‌ సరికాదు

సి) ఏ సరైనది, ఆర్‌ సరికాదు

డి) ఏ తప్పు, ఆర్‌ సరైనది

వివరణ: సూక్ష్మ, లఘు సంస్థలకు అత్యున్నత వ్యవస్థ అయిన ఖాదీ విలేజ్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ ఈ-కామర్స్‌ పోర్టల్‌ను ప్రారంభించింది. 50,000 ఉత్పత్తులను ఈ పోర్టల్‌ ద్వారా విక్రయిస్తారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు స్వయం స్వావలంబన సాధించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం.

10. డిజిటల్‌ పేమెంట్‌ ఇండెక్స్‌కు ఆధార సంవత్సరం ఏది? (డి)

ఎ) నవంబర్‌ 2016

బి) ఏప్రిల్‌ 2018

సి) మార్చి 2020

డి) మార్చి 2018

వివరణ: మార్చి 2018 ఆధార కాలంగా ఆర్‌బీఐ డిజిటల్‌ చెల్లింపుల సూచీని రూపొందించింది. సూచీలో ఐదు ప్రమాణాలు ఉన్నాయి. అవి.. 1. చెల్లింపుల ప్రోత్సాహకాలు (దీనికి 25% వెయిటేజీ ఇచ్చారు) 

2. చెల్లింపుల మౌలిక సౌకర్యాలు (డిమాండ్‌ నుంచి 10% వెయిటేజీ)

3. చెల్లింపుల మౌలిక సౌకర్యాలు (సరఫరా నుంచి 25% వెయిటేజీ) 

4. చెల్లింపు సమర్థత (45% వెయిటేజీ) 

5. వినియోగదారుల లబ్ధి (5% వెయిటేజీ) 2021 నుంచి ఆర్‌బీఐ ఈ సూచీని విడుదల చేయనుంది.

11. ఇంటర్నేషనల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సెంటర్స్‌ అథారిటీ ప్రధాన కేంద్రం ఏ రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతంలో ఉంది? (డి)

ఎ) మహారాష్ట్ర          బి) ఢిల్లీ       

సి) ఉత్తరప్రదేశ్‌        డి) గుజరాత్‌

వివరణ: ఇంటర్నేషనల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సెంటర్‌ అథారిటీని ఏప్రిల్‌ 27, 2020లో ఏర్పాటు చేశారు. ఇటీవల ఈ సంస్థ ఇంటర్నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ సెక్యూరిటీస్‌ కమిషన్స్‌ (ఐవోఎస్‌సీవో)లో సహ సభ్యత్వాన్ని పొందింది. సెక్యూరిటీ మార్కెట్లో ప్రమాణాలను ఏర్పాటు చేయడానికి ఐవోఎస్‌సీవో కృషి చేస్తుంది. 

12. మానవాభివృద్ధి నివేదికలో భారత్‌ ఎన్నో స్థానంలో నిలిచింది? (సి)

ఎ) 129   బి) 130   సి) 131   డి) 132

వివరణ: మానవాభివృద్ధి నివేదికలో భారత్‌ 189 దేశాలకుగాను 131వ స్థానంలో నిలిచింది. దీనిని యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ విడుదల చేసింది. మూడు అంశాల ప్రాతిపదికన ఈ నివేదికను రూపొందిస్తారు. అవి.. 1. ఆయుర్దాయం 2. విద్య 3. జీవన ప్రమాణం. భారత్‌ హెచ్‌డీఐ విలువ 0.645గా ఉంది. 1990 నుంచి 2019 మధ్య భారత హెచ్‌డీఐ విలువ 50% పెరిగింది. ఈ సూచీలో తొలి ఐదు స్థానాల్లో నిలిచిన దేశాలు వరుసగా.. నార్వే, ఐర్లాండ్‌, స్విట్జర్లాండ్‌, హాంకాంగ్‌, ఐస్‌లాండ్‌

13. కింది వాక్యాలను పరిశీలించండి (డి)

1. దక్షిణ భారత దేశంలో తొలి కిసాన్‌ రైలు అనంతపురం నుంచి ఢిల్లీకి వెళ్లింది

2. దేశంలో 100వ కిసాన్‌ రైలు మహారాష్ట్ర నుంచి పశ్చిమబెంగాల్‌ వరకు 

ప్రారంభించారు

పై వాక్యాల్లో సరైనవి?

ఎ) 1   బి) 2    సి) ఏదీకాదు   డి) 1, 2

వివరణ: రైతుల ఉత్పత్తులకు మార్కెట్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు కిసాన్‌ రైళ్ల ప్రతిపాదన 2020-21 బడ్జెట్‌లో ప్రతిపాదించారు. తొలి కిసాన్‌ రైలును 2020 ఆగస్ట్‌లో మహారాష్ట్ర నుంచి బీహార్‌ వరకు నడిపారు. రెండో కిసాన్‌ రైలు, అదే విధంగా దక్షిణ భారత దేశంలో తొలి కిసాన్‌ రైలును ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం నుంచి ఢిల్లీకి నడిపారు. ఇటీవల 100వ రైలును కూడా అందుబాటులోకి తెచ్చారు. మహారాష్ట్రలోని సంగోల నుంచి పశ్చిమబెంగాల్‌లోని షాలిమార్‌ వరకు అందుబాటులోకి తెచ్చారు.

14. యూఎస్‌టీఆర్‌ 301 ఇటీవల వార్తల్లో నిలిచింది. ఎందుకు? (బి)

ఎ) భారత్‌తో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది            

బి) భారత్‌ విధించే డిజిటల్‌ పన్నుపై 

    అభ్యంతరం చెప్పింది       

సి) జీఎస్టీలో మరిన్ని సంస్కరణలు రావాలని కోరింది          డి) ఏదీకాదు

వివరణ: యూఎస్‌టీఆర్‌ అంటే యునైటెడ్‌ స్టేట్స్‌ ట్రేడ్‌ రిప్రజెంటేటివ్‌. ఇది ఒక నివేదికను రూపొందించింది. భారత డిజిటల్‌ పన్ను విధానాన్ని విమర్శించింది. ఇటలీ, టర్కీలు కూడా అవలంబిస్తున్న విధానాలు అమెరికా పట్ల వివక్ష చూపుతున్నాయని ఆరోపించింది. దేశంలో అందించే డిజిటల్‌ సేవలకు ఆయా సంస్థలపై 2% పన్నును విధిస్తున్నారు. 

15. బొగ్గు ఆధారిత పరిశ్రమల నుంచి అధికంగా విద్యుత్‌ను పొందుతున్న రాష్ర్టాల్లో అగ్రస్థానంలో ఉన్నది? (సి)

ఎ) తెలంగాణ    బి) గుజరాత్‌      

సి) పశ్చిమబెంగాల్‌     డి) జార్ఖండ్‌

వివరణ: ప్రస్తుతం దేశంలో బొగ్గు ఆధారిత పరిశ్రమల నుంచి విద్యుత్‌ను పొందుతున్న రాష్ర్టాల్లో అగ్రస్థానంలో పశ్చిమబెంగాల్‌ ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా తెలంగాణ, గుజరాత్‌ ఉన్నాయి. దేశ ఇంధన వినియోగంలో 58% బొగ్గు, పెట్రోలియం ఇతర వనరులు 26% ఉన్నాయి. సహజ వాయువు, పునరుత్పాదక ఇంధన వాటా 6.2% మాత్రమే ఉంది. 2030 నాటికి దేశంలో పునరుత్పాదక శక్తి వనరుల వాటా 15 శాతానికి చేర్చడమే భారత్‌ లక్ష్యంగా ఎంచుకుంది. 

వి.రాజేంద్ర శర్మ

ఫ్యాకల్టీ , వ్యొమా.నెట్‌ , 9849212411


VIDEOS

logo