హైదరాబాద్ : నగరంలోని ఎమ్మెల్సీ కవిత నివాసంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత జన్మదిన వేడుకలు జరిగాయి. ఏంపీ వెంకటేష్ కేక్ కట్ చేశారు. ఎంపీకి ఎమ్మెల్సీ కవిత, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ..వెంకటేష్ ఆయురారోగ్యాలతో జీవించాలన్నారు. ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు.