వాషింగ్టన్ : యూట్యూబ్ నుంచి సంపాదించే వారిని టాక్స్ నెట్ కిందకు అమెరికా ప్రభుత్వం తీసుకొచ్చింది. యూట్యూబర్స్ ఆదాయంపై ఇప్పుడు యూఎస్ టాక్స్ లా ప్రకారం 24 శాతం వరకు పన్ను విధిస్తారు. భారతదేశ కంటెంట్ సృష్టికర్తలపై ఏ మేర ప్రభావం ఉంటుందనే దానిపై విస్తృతంగా చర్చ జరుగుతున్నది.
యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించేవారికి ఈ నెల నుంచి పన్ను విధించేందుకు అమెరికా ప్రభుత్వం సిద్దమైంది. ఈ కొత్త విధానం యూఎస్ వెలుపల ఉన్న కంటెంట్ సృష్టికర్తలపై కూడా నేటి నుంచి అమల్లోకి వచ్చింది. అయితే, భారత వీడియోలలో అమెరికన్ వీక్షకుల సంఖ్య తక్కువగా ఉన్నందున, కొత్త నియమం భారతదేశ సృష్టికర్తలపై పెద్దగా ప్రభావం చూపదని నిపుణులు అంటున్నారు.
అమెరికా టాక్స్ లా ‘ఇంటర్నల్ రెవెన్యూ కోడ్’ 3 వ అధ్యాయం ప్రకారం, యూఎస్ వీక్షకుల సంఖ్యను సంపాదించే కంటెంట్ సృష్టికర్తల నుంచి యూట్యూబ్‌లో పన్ను సమాచారాన్ని సేకరించే బాధ్యత గూగుల్‌పై ఉంచారు. వారి ఆదాయాల నుంచి పన్ను కోత విధించి ఆ మొత్తాన్ని ప్రభుత్వానికి జమ చేయాల్సి ఉంటుంది. గూగుల్ సంస్థ ఈ కొత్త పాలసీని ఈ ఏడాది మార్చిలో ప్రకటించింది. దీని ప్రకారం, యూట్యూబ్ పార్ట్నర్షిప్ ప్రోగ్రాంలో చేర్చబడిన కంటెంట్ సృష్టికర్తలందరూ ప్రపంచంలో ఎక్కడ నివసిస్తున్నారనే దానితో సంబంధం లేకుండా మే 31 లోగా పన్ను సమాచారాన్ని సమర్పించాల్సి ఉంటుంది.
బ్రిటన్‌లో మండుతున్న ఎండలు.. సముద్రం ఒడ్డుకు 40 లక్షల జనం
ఈ ఆరు లక్షణాలను అశ్రద్ధ చేయకండి
నేటి నుంచి గూగుల్ ఫొటో ఉచిత సేవలు బంద్
ద్రవ్యోల్బణం మధ్య ఉపశమనం: రూ.122 తగ్గిన ఎల్పీజీ సిలిండర్
గొలుసుల్లో బంధించిన బాల్యం: ఆతృతతో తింటూ ఆరేండ్ల శరణార్థి కన్నుమూత
ప్రధాని కలల ప్రాజెక్టులో ప్రమాదం.. ఇద్దరు కూలీలు మృతి
నేపాల్ రాజ కుటుంబం ఊచకోత.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..