మక్తల్, అక్టోబర్ 18 : మక్తల్ మినీ ట్యాంక్‌బండ్ సమీపంలో పారు నిర్మించాల్సిన స్థలంలో లాడ్జి, వ్యాపార సముదా యం, సులభ్ కాంప్లెక్స్ నిర్మాణాలు చేపట్టేందుకు ఆరోగ్యశాఖ మంత్రి భూమిపూ జ చేయడం సిగ్గుచేటని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. శనివారం మక్తల్‌లోని తన నివాసగృహంలో చిట్టెం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మక్తల్ పెద్ద చెరువు కట్ట వద్ద మిగిలిన స్థలంలో అద్భుతమైన పారు ఏర్పా టు చేయడం కోసం బీఆర్ఎస్ హ యాంలో స్థలాన్ని చదునుచేసి సుందరం గా తీర్చిదిద్దడం జరిగిందన్నారు.
ఆ స్థలం లో పారు నిర్మాణం చేపట్టడంతోపాటు, భారీ స్థాయిలో జాతీయ జెండాను ఏర్పా టు చేసేందుకు టెండర్లను సైతం పిలిచామని గుర్తుచేశారు. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ కారణంగా పనులు నిలిచిపోయాయని తెలిపారు. ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఎమ్మెల్యేగా గెలుపొందిన వాకిటి శ్రీహరి పారు చేపట్టాల్సిన స్థ లంలో లాడ్జి, వ్యాపార సముదాయ ని ర్మాణం, సులభ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాలని మున్సిపల్ కార్యవర్గ సమావేశం లో తీర్మానం చేశారన్నారు. అయినప్పటికీ ఎమ్మెల్యే పెట్టించిన తీర్మానాన్ని సభ్యులు తిరసరించి పారు నిర్మాణం చేపట్టాలని స్పష్టం చేశారని గుర్తుచేశా రు.
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీహరి మళ్లీ పార్కు కాకుండా ఇతర ని ర్మాణాలకు అనుమతులు తీసుకొచ్చారని చెప్పారు. ప్రజలకు ఉపయోగపడే 150 పడకల దవాఖాన కోసం కేసీఆర్ హ యాంలోనే అనుమతులు వచ్చినా రెం డేండ్లు గడిచినా కాంగ్రెస్ సర్కారు వాటి ఊసే ఎత్తడం లేదని ఆరోపించారు. అభివృద్ధికి అడ్డంకిగా మారకుండా ప్రజలకు పనికొచ్చే పనులు చేపట్టి మక్తల్ అభివృద్ధికి పాటుపడాలని చిట్టెం సూచించారు.