కల్వకుర్తి, అక్టోబర్ 17 : రాష్ట్రంలో కాం గ్రెస్ పార్టీ ప్రజాపాలన పేరుతో ప్రతీకార పాలన సాగిస్తుందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధా న కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ దుయ్యబట్టారు. పాలన ను గాలికొదిలి ఢిల్లీకి సంచులో మోయడం తో ముఖ్యమంత్రి, సెటిల్మెంట్లు, వసూళ్లు చేయడంతో మంత్రు లు, ఎమ్మెల్యేలు బిజీ గా ఉన్నారని ఆయన మండిపడ్డారు. కల్వకుర్తి పట్టణంలోని గిరిజన గురుకుల బాలికల ఆశ్రమ పాఠశాలను శుక్రవారం మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఉప్ప ల వెంకటేశ్‌తో కలిసి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సం దర్శించారు. గత 35రోజులుగా సమ్మె చేస్తున్న డైలీవేజ్ కార్మికులకు సంఘీభావం ప్రకటించారు. వంట వాళ్లు లేక ఆకలిబాధ చవిచూసిన విద్యార్థినులతో మాట్లాడారు.
పాఠశాలలో పనిచేస్తున్న ఒప్పంద ఉపాధ్యాయులతో మాట్లాడారు. తమకు నాలుగైదు నెలలుగా జీతాలు రావడం లేదని వారు ఆర్ఎస్పీ దృష్టికి తీసుకువచ్చి వినతిపత్రం ఇచ్చారు. సమస్యలను అన్నింటిని ఆకలింపు చేసుకున్న ఆర్ఎస్పీ మీడియాతో మాట్లాడారు. అందరికీ నాణ్యమైన విద్య అందాలనే ఉద్దేశంతో కేసీఆర్ గురుకులాలను స్థాపిస్తే..కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ సర్కార్ గురుకులాలను నిర్వీ ర్యం చేసేందుకు కుట్ర పన్నిందని దుయ్యబట్టారు. అం దరు విద్యావంతులు అయితే తమ పనులు ఎవరు చేస్తారనే పెత్తందారి మనస్తత్వం కలిగిన కాంగ్రెస్ పార్టీ గురుకులాలు నాశనం అయ్యేవిధంగా నిర్ణయాలు తీసుకుంటుందని, అందులో భాగంగానే ఆశ్రమ పాఠశాలలో వంటవాళ్లకు జీతాలు తగ్గించడమేనని ఉదాహరణగా చెప్పారు.
జీతాలు పెంచాలని తప్పనిసరి పరిస్థితులలో వంట కార్మికులు సమ్మె చేస్తుండటంతో ప్రత్యామ్నాయ వనరులు చేట్టాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో విద్యార్థులు ఆకలితో అల్లాడిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. గత 36 రోజుల నుంచి పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు ఏదో విధంగా విద్యార్థులకు వండి వడిస్తే.. చివరకు వారిపైనే చర్యలు తీసుకోవ డం చాలా దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించకుండా హెచ్ఎంను బాధ్యుడిని చేయ డం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఏదైనా చర్యలు తీసుకోవాలను కుంటే సమస్య పరిష్కరించకుండా నాటకా లు ఆడుతున్న ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా ఉన్నతాధికారులపై తీసుకోవాలన్నారు.
జువైనల్ హోంలో విద్యార్థులపై లైంగిక ఆరోపణలు, గురుకులాల్లో ఆకలి కేకలు, గాలికి వదిలిన పాలన చేస్తుంటే.. రాష్ట్రంలో ధృతరాష్ట్ర, దుశ్శాసన పాలన సాగుతుందని ఆర్ఎస్పీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇంతకు రాష్ట్రంలో సంక్షేమ శాఖ అనేది ఉందా అని అనుమానం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఏ ఒక్కరోజైన గురుకుల పాఠశాలలను సందర్శించా రా..? విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారా? అంటూ మండిపడ్డారు. పదవిని కా పాడుకోవడానికి ఢిల్లీకి సంచులో మోయడం కాదు.. పా లనపై దృష్టి సారించాలని రేవంత్‌కు హితవు పలికారు..
ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య వాటాల పంచాయితీ తారాస్థాయికి చేరుకుందని ఆర్ఎస్పీ ఎద్దేవా చేశారు. పొన్నం వర్సెస్ లక్ష్మణ్, లక్ష్మణ్ వర్సెస్ వివేక్, పొంగులేటి వర్సెస్ కొండా సురేఖ ఇలా మంత్రుల మధ్య జోరుగా పంచాయితీ సాగుతుందని, ఇదంతా వాటాల కోసం సాగుతున్న ఆధిపత్య పోరని ఆర్ఎస్పీ అన్నారు. కొండా సురేఖ కూతురు మాట్లాడిన మాటలు వింటుంటే రాష్ట్రంలో గెస్ట్‌హౌస్‌ల పాలన సాగుతుందని, తుపాకి నీడలో బెదిరింపులు, వసూళ్ల పర్వం సాగుతుందని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి, మంత్రుల వెనుక ఉన్న అదృశ్య శక్తులు మాఫీయా పాలన సాగిస్తున్నాయని, ముడుపులలో తేడా వస్తే తుపాకి బయటకు వ స్తుందని.. దీనికి ఉదాహరణ ఓఎస్డీ సుమంత్, రోహణ్రెడ్డిలే చక్కని ఉదాహరణలని ఆర్ఎస్పీ వివరించారు. మంత్రి సురేఖ కూతురు అన్నట్లు కొండా సురేఖ ఇళ్లే కాదు..ఇతర మంత్రులు..సీఎం సోదరుల ఇళ్లు కూడా పోలీసుల చేత తనిఖీ చేయించాలని డిమాండ్ చేశారు.
బ్రిలియంట్ విద్యాసంస్థల అధినేత..విద్యావేత్త అనిపించుకుంటున్న ఎమ్మెల్యే నారాయణరెడ్డి ఒక్క రోజైన గురుకుల పాఠశాలలను సందర్శించారా అని ఆర్ఎస్పీ ప్రశ్నించారు. ఆశ్రమ పాఠశాలలో వంట సిబ్బంది సమ్మె చేస్తుంటే.. విద్యార్థులు ఎలా ఉంటున్నారు..ఏం తింటున్నారు అని ఒక్క పూటైన వాకబు చేశారా…అంటూ దు య్యబట్టారు. మీ విద్యాసంస్థల్లో ఇలాంటి పరిస్థితి వస్తే ఇలాగే పట్టించుకోకుండా ఉంటారా అని మండిపడ్డారు. పేద పిల్లలే కదా..చదివితే ఏంది..ఇంటికి పోతే ఏందని అనుకున్నారా అని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే గ్రీన్ చానెల్ ద్వారా గురుకులాలకు నిధులు విడుదల చేసి సమస్యలు పరిష్కరించాల ని, సమ్మె చేస్తున్న సిబ్బంది సమస్యలు, అధ్యాపకుల స మస్యలు పరిష్కరించాలని ఆర్ఎస్పీ డిమాండ్ చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం గా నిలివాలని ఆర్ఎస్పీ అన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తున్న కాంగ్రెస్ పార్టీకి కర్రుకాల్సి వాత పెట్టే విధంగా జూబ్లీహిల్స్ ఫలితం ఉండాలని ఆర్ఎస్పీ పిలుపునిచ్చారు. కమిషన్ల దందాకు చెక్ పడేలా, ఆర్ఆర్టాక్స్కు చరమగీతం పాడేలా..తుపాకి కల్చర్ కనుమరుగయ్యేలా..గెస్ట్‌హౌస్ మాఫియా పాలన అంతమయ్యేలా.. విద్యార్థులకు సంక్షేమం అందేలా జూబ్లీహిల్స్ ఫలితం ఉండాలని ఆర్ఎస్పీ జూబ్లీహిల్స్ ప్రజలను కోరారు. భర్తను కోల్పోయిన బీఆర్ఎస్ అభ్యర్థి పుట్టెడు దుఃఖంలో భర్తను తలుచుకుని కన్నీళ్లు పెట్టుకుంటే..ఆ కన్నీళ్ళను కూడా అపహాస్యం చేసిన అభినవ దుశ్శాసనుల రాజకీయ చరిత్ర కనుమరుగయ్యేలా జూబ్లీహిల్స్ ఓటర్లు విజ్ఞతో వ్యవహరించాలని ఆర్ఎస్పీ కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు బావండ్ల వెంకటేశ్, కార్మిక సంఘ నాయకుడు సూర్యప్రకాశ్‌రావు, మాజీ సర్పంచ్ సుశీల, బీఆర్ఎస్ నాయకులు శ్రీనువాసులు, సురేశ్,బీఆర్ఎస్వీ గణేశ్, కిశోర్ తదితరులు పాల్గొన్నారు.