నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
ఇంటర్ మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు ఇంటర్మీడియేట్ విద్యాశాఖ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సర్వం సిద్ధం చేసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 57,353మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరి కోసం 103 కేంద్రాలు ఏర్పా టు చేశారు. ఉదయం 9గంటల నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. విద్యార్థులను గంట ముందుగానే పరీక్షా కేం ద్రాల్లోకి అనుమతిస్తారు.
- ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 103 పరీక్షా కేంద్రాలు
- హాజరు కానున్న 57,353 మంది విద్యార్థులు
- 5 నిమిషాలు ఆలస్యమైనా ఒకే
- పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలతో నిఘా
- అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 166 కోడ్ అమలు
- కలెక్టర్లతో సీఎస్, ప్రిన్సిపల్ సెక్రటరీ, బోర్డు కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్
- ఉమ్మడి జిల్లాలో పరీక్షల కేంద్రాలను పరిశీలించి డీఐఈవోలు
రామగిరి, ఫిబ్రవరి 24: ఇంటర్ మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు ఇంటర్మీడియేట్ విద్యాశాఖ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సర్వం సిద్ధం చేసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 57,353మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరి కోసం 103 కేంద్రాలు ఏర్పా టు చేశారు. ఉదయం 9గంటల నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. విద్యార్థులను గంట ముందుగానే పరీక్షా కేం ద్రాల్లోకి అనుమతిస్తారు. ఈ సారి నిర్ణీత సమ యం కంటే 5 నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేం ద్రంలోకి విద్యార్థులను అనుమతిస్తామని అధికారులు వెల్లడించారు. పరీక్షల నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్లు, డీఐఈవోలతో రాష్ట్ర ఫ్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రిన్సిసల్ సెక్రటరీ యోగితా రాణా, ఇంటర్ విద్య కమిషనర్ కృష్ణాదిత్య వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
అదే విధంగా ఆయా జిల్లాల కలెక్టర్ల సైతం అధికారులతో సమావేశమై పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద 163 బీఎన్ఎస్ఎస్ చట్టం అమలులో ఉంటుంది. పరీక్షా కేంద్రాల సమీపంలో ఉన్న జిరాక్స్ సెంటర్లను పరీక్ష సమయం ముగిసేవరకు మూసివేశాలని ఆదేశించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు, సీటింగ్ ఏర్పాట్లను నల్లగొండ డీఐఈవో దస్రూ నాయక్, సూర్యాపేట జిల్లాలో డీఐఈవో భానూ నాయక్, యాదాద్రి భువనగిరి జిల్లాలో సీహెచ్ రమణి పరిశీలించారు.
103 పరీక్ష కేంద్రాలు
ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 57,353మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. రెగ్యులర్, ఓకేషన్ విభాగంలో ప్రథమ సంవత్సరం 28,732 మంది, ద్వితీయ సంవత్సరం 28,621 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. ఈ పరీక్షల నిర్వహణకు ఆయా లో జిల్లా వ్యాప్తంగా 103 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని డివిజన్ కేంద్రాల్లో సైతం పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.
హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే..
పరీక్షల నిర్వహణపై నల్లగొండ జిల్లాలో 9848309004, సూర్యాపేట జిల్లాలో 9000004654, యాదాద్రి భువనగిరి జిల్లాలో 9849302073 నంబర్లతో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. పరీక్షలపై ఏమైనా సందేహాలు, సలహాలు, సూచనలు ఉంటే ఈ నంబర్లలో సంప్రదించవచ్చు.

Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | అభిజీత్ దీప్కే నివాసానికి చేరుకున్న ఢిల్లీ పోలీసులు.. ర్యాలీకి వెళ్లకూడదంటూ నోటీసులు జారీ
Kumbha | ‘కుంభ’లోని శక్తిని ఇప్పుడే తట్టిలేపాలని అనుకోవడం లేదు.. పృథ్వీరాజ్ బర్త్‌డేపై రాజమౌళి ట్వీట్
Vidya Balan | ఎం.ఎస్.సుబ్బులక్ష్మి బయోపిక్.. నా కల నెరవేరలేదంటూ విద్యాబాలన్ భావోద్వేగం!
Jobs | రైల్వేలో 1688 ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల.. సికింద్రాబాద్ జోన్లో 72 పోస్టులు
Y.S. Jagan | ఎంపీ మిథున్‌రెడ్డి కాన్వాయ్‌పై రాళ్లతో దాడులు.. ఖండించిన వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

