హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 18 : హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టే డియం (జేఎన్ఎస్)లో జరిగిన 5వ ఓపె న్ నేషనల్ అండర్-23 జాతీయ అథ్లెటి క్స్ ఛాంపియన్‌షిప్‌లో కొత్త రికార్డులు న మోదయ్యాయి. మూడురోజుల పాటు జరిగిన ఈ పోటీలు శనివారం ముగియగా మొత్తం ఏడుగురు పాత రికార్డులను చెరి పేసి నయా చరిత్ర సృష్టించారు. మహిళల 100 మీటర్ల పరుగుపందెంలో సుధీష్ణ హ నుమంత శివాంకర్ (మహారాష్ట్ర), సాక్షి (గుజరాత్), డిస్కస్‌త్రోలో నిఖితకుమారి (రాజస్థాన్), మెన్ 20 వేల మీటర్ల రేస్‌వాక్‌లో సచిన్ బొహ్రా (ఉత్తరాఖండ్), లాంగ్‌జంప్‌లో అనురాగ్ సీవీ (కేరళ), 400 మీటర్ల హార్డిల్స్‌లో అర్జున్ ప్రదీప్ (కేరళ) రికార్డులు నమోదు చేశారు.
కాగా లాంగ్‌జంప్‌లో అను రాగ్ సీవీ తన రికార్డును తానే బ్రేక్ చేసుకున్నాడు. 2024లో తన పేరు మీదున్న 7.87 మీటర్ల పాత రికా ర్డును 8.06 మీటర్స్‌తో చెరిపేశాడు. కాగా, చివరిరోజు జరిగిన 16 ఈవెంట్లలో అథ్లెట్లు పాల్గొని పతకాలు సా ధించారు. పోటీల్లో మొత్తం 937 మంది క్రీడాకారులు పాల్గొనగా, తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు స్టాన్లీ జోన్స్, తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియే షన్ చైర్మన్ వరద రాజేశ్వర్‌రావు, రాష్ట్ర కార్యదర్శి సారంగపాణి, డీవైఎస్వో గుగులోత్ అశోక్‌కుమార్, ములుగు జిల్లా అధ్యక్షుడు, రెజోనెన్స్ విద్యాసంస్థల చైర్మన్ రాజిరెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ పగిడిపాటి వెంకటేశ్వర్, వరంగల్ జిల్లా సెక్రటరీ యుగేంధర్ ప్రతిభకనబర్చిన అథ్లెట్లకు మెడల్స్ అందజేశారు.