కాసిపేట : కుట్టు శిక్షణ ( Sewing Training ) తీసుకుంటున్న మహిళలకు పరీక్ష నిర్వహించి, ఉత్తీర్ణత సాధించిన వారికి సర్టిఫికెట్లు ( Certificates ) అందిస్తామని మంచిర్యాల వయోజన విద్యాశాఖ అధికారి పురుషోత్తం నాయక్ ( Purushottam Nayak ) పేర్కొన్నారు. మంగళవారం కాసిపేట మండల మండల పరిషత్ కార్యాలయంలో అక్షరాస్యత, కుట్టు మిషన్పై శిక్షణ ఇస్తున్న బోధకులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంద రోజుల్లో వంద శాతం అక్షరాస్యత సాధించేందుకు కృషి చేసినందుకు అభినందించారు. మండలంలో 22 గ్రామ పంచాయతీల్లో దాదాపు 500 మందికి పైగా మహిళలకు బోధకులచే కుట్టు మిషన్ పై శిక్షణ ఇచ్చినట్లు వివరించారు.
మధ్యలోనే చదువు మానేసిన వారు ఎవరైనా ఉంటే తెలంగాణ ఓపెన్ స్కూల్ ద్వారా టెన్త్, ఇంటర్ అడ్మిషన్ పొందేందుకు ఈనెల 23వ తేదీ వరకు అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం రాజ్ కుమార్, జాబ్స్ ఏపీఎం రాంచందర్, వయోజన విద్యాశాఖ సిబ్బంది సుమన్, సీసీ అశోక్ కుమార్ పాల్గొన్నారు.