మంచిర్యాల : క్రమ శిక్షణకు మారుపేరుగా చెప్పుకునే బీజేపీ (BJP) లో గాడి తప్పుతుంది. సాక్షాత్ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సమక్షంలో ఇద్దరు నాయకులు వాగ్వాదం చేసుకున్నారు. ఒకరినొకరు బూతులు తిట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు( Ramachandra Rao) మంగళవారం
వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఏట మధుకర్ కుటుంబాన్ని పరామర్శించేందుకు గ్రామానికి వెళ్లారు.
మాజీ ఎంపీ వెంకటేశ్ నేత, బీజేపీ పెద్దపల్లి ఎంపీగా పోటీ చేసిన గోమాసే శ్రీనివాస్ మధ్య వాగ్వాదం జరిగింది. గోమాసే శ్రీనివాస్‌ను వెంకటేశ్ నేత అరేయ్ అనడంతో గుడ్డలు ఊడితీసి కొడతానని శ్రీనివాస్ అనడంతో ఇద్దరి మధ్య గొడవ తీవ్రస్థాయిలో చర్చకు దారి తీసింది. దీంతో అక్కడే ఉన్న నాయకులు ఇద్దరిని సముదాయించడంతో వాగ్వాదం సద్దుమణిగింది.