Certificates | కుట్టు శిక్షణపై పరీక్ష నిర్వహించి సర్టిఫికెట్స్ అందిస్తాం : జిల్లా వయోజన విద్యాధికారి
Certificates | కుట్టు శిక్షణ తీసుకుంటున్న మహిళలకు పరీక్ష నిర్వహించి, ఉత్తీర్ణత సాధించిన వారికి సర్టిఫికెట్లు అందిస్తామని మంచిర్యాల వయోజన విద్యాశాఖ అధికారి పురుషోత్తం నాయక్ పేర్కొన్నారు.
కాసిపేట : కుట్టు శిక్షణ ( Sewing Training ) తీసుకుంటున్న మహిళలకు పరీక్ష నిర్వహించి, ఉత్తీర్ణత సాధించిన వారికి సర్టిఫికెట్లు ( Certificates ) అందిస్తామని మంచిర్యాల వయోజన విద్యాశాఖ అధికారి పురుషోత్తం నాయక్ ( Purushottam Nayak ) పేర్కొన్నారు. మంగళవారం కాసిపేట మండల మండల పరిషత్ కార్యాలయంలో అక్షరాస్యత, కుట్టు మిషన్‌పై శిక్షణ ఇస్తున్న బోధకులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంద రోజుల్లో వంద శాతం అక్షరాస్యత సాధించేందుకు కృషి చేసినందుకు అభినందించారు. మండలంలో 22 గ్రామ పంచాయతీల్లో దాదాపు 500 మందికి పైగా మహిళలకు బోధకులచే కుట్టు మిషన్ పై శిక్షణ ఇచ్చినట్లు వివరించారు.
మధ్యలోనే చదువు మానేసిన వారు ఎవరైనా ఉంటే తెలంగాణ ఓపెన్ స్కూల్ ద్వారా టెన్త్, ఇంటర్ అడ్మిషన్ పొందేందుకు ఈనెల 23వ తేదీ వరకు అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం రాజ్ కుమార్, జాబ్స్ ఏపీఎం రాంచందర్, వయోజన విద్యాశాఖ సిబ్బంది సుమన్, సీసీ అశోక్ కుమార్ పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TMREIS | మైనారిటీలపై సర్కార్ కుట్ర.. 75% సీట్లను 17% కుదిస్తే మైనారిటీ బిడ్డల భవిష్యత్తు ఏం కావాలి?: అబ్దుల్ వాహబ్
Ambedkar | అంబేద్కర్‌కు అవమానం.. రాజ్యాంగ దినోత్సవం నాడు ఇచ్చిన ప్రకటనల్లో రాజ్యాంగ నిర్మాత ఫొటో మాయం
Horoscope | 27-11-2026 శుక్రవారం.. మీ రాశి ఫలాలు
ఈడా మనమే.. ఆడా మనమే!
ఒక నాయకుడి సంకల్పం..
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

